5న బ్రహ్మాండం బద్దలవుతుంది

ప్ర‌భాస్ అభిమానుల‌కు అక్టోబ‌రు 5న అదిరిపోయే వార్త చేర‌వేస్తాన‌ని మాటిచ్చాడు రాజ‌మౌళి. అది బాహుబ‌లి 2కి సంబంధించిన వార్త కాదు, ప్ర‌భాస్ పెళ్లికి సంబంధించిన వార్త కాదు, అవార్డు విష‌యం కాదు.. అంటూ క్లారిటీ ఇచ్చాడు. మ‌రి 5న రాజ‌మౌళి ఏం చెప్ప‌బోతున్నాడు?? ఆరోజున బ్ర‌హ్మాండం బ‌ద్ద‌ల‌య్యే న్యూస్ ఏమిటి? అనే విష‌యంపై ఆస‌క్తి నెల‌కొంది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు?? అనే ప్ర‌శ్న‌కు జ‌వాబు కంటే… 5న రాజ‌మౌళి ఏం చెప్ప‌బోతున్నాడ‌న్న ప్ర‌శ్న‌కే క్రేజ్ ఎక్కువ‌లా క‌నిపిస్తోంది.

ఈలోగా ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌లైపోయాయి. ప్ర‌భాస్‌కి ఓ హాలీవుడ్ సంస్థ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు, ఆ విష‌య‌మే రాజ‌మౌళి చెప్ప‌బోతున్న‌ట్టు స‌మాచారం. వార్న‌ర్ బ్ర‌దర్స్ లాంటి హాలీవుడ్ దిగ్గ‌జం ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌బోతోంద‌ని, ఆ విష‌య‌మే రాజ‌మౌళి 5న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి చేర‌వేస్తాడ‌ని చెబుతున్నారు. ఈ విష‌య‌మై ఈనెల 5న క్లారిటీ వ‌స్తుంద‌ని, క్లారిటీ వ‌చ్చాకే ప్ర‌భాస్ హాలీవుడ్ సినిమాపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రిస్తారని, అందుకే 5న చెబుతా.. అంటూ రాజ‌మౌళి ముహూర్తం ఫిక్స్ చేశాడ‌ని చెప్పుకొంటున్నారు. ఇదే విష‌య‌మై బాహుబ‌లి పీఆర్‌ని సంప్ర‌దిస్తే… “ఇది సినిమాల‌కు సంబంధించిన ఇష్యూ కాదు. కానీ… ఆ వార్త మాత్రం అంద‌రినీ సంభ్ర‌మాశ్చార్యాల‌కు గురి చేయ‌డం ఖాయం. ప్ర‌భాస్ కెరీర్‌కి సంబంధించిన ఓ కీల‌క‌మైన మ‌లుపు అది“ అంటూ ఊరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com