మోడీ పిలుపునిచ్చిన తర్వాత సమస్యలు రావడమా..!?

ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల సేపు లైట్లు ఆర్పేసి.. కొవ్వొత్తులు వెలిగిలించి చీకట్లు పారదోలమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుపై .. విద్యుత్ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కరెంట్ వినియోగం ఒక్క సారిగా నిలిపివేస్తే.. గ్రిడ్ కుప్పకూలుతుందనే ఆందోళన వ్యక్తమయింది. అయితే.. ఇలాంటి సమస్యలన్నింటినీ తాము పరిష్కరించుకుంటామని.. ప్రజలంతా… మోడీ చెప్పినట్లుగా లైట్లు ఆర్పేసి.. క్యాండిల్స్ వెలిగించాలని భరోసా ఇచ్చాయి. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లి లేఖ రాశారు. అందరూ ఒకే సారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిడ్‌పై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

కొన్ని నిబంధనలను.. ఈ మేరకు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపింది. వీధి లైట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని స్పష్టం చేసింది. వీధి లైట్లు, శాంతి భద్రతల విషయంలో స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఆలాగే ఆస్పత్రులు సహా అన్ని అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన పని లేదని రాష్ట్రాలకు పంపిన సూచనల్లో స్పష్టం చేసింది. విద్యుత్ గ్రిడ్ ప్రత్యేకమైనది. దానిలో కరెంట్ ప్రసారం నిరంతరాయంగా ఉండాలి. అదీ కూడా సామర్థ్యం మేరకు ఉండాలి. ఎక్కవైనా.. తక్కువైనా.. గ్రిడ్ ఫెయిలవుతుంది. అది అన్ని స్థాయిల్లోనూ ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు కూడా లోడ్ ఎక్కువైతే కాలిపోతూంటాయి. ఈ సాంకేతిక అంశాలతో.. ప్రధానమంత్రి మోడీ పిలుపుతో గందరగోళం ఏర్పడింది.

అయితే.. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి.. కేంద్రమే ముందుకు వచ్చింది. మోడీ పిలుపునకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని నిర్ణయించుకుంది. దే్శంలో ఇప్పుడు.. విద్యుత్ వినియోగం తక్కువగా ఉంది. పారిశ్రామిక సంస్థలన్నీ ఉత్పత్తిని నిలిపివేయడంతో.. కరెంట్ మిగులు ఉంది. దీంతో అతి తక్కువ వినియోగం జరుగుతోంది. మోడీ పిలుపుతో దేశ వ్యాప్తంగా కరెంట్ వినియోగం నిలిపివేస్తే మరింత తగ్గుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

బాలీవుడ్‌లో పాగా.. ఇదే క‌రెక్ట్ టైమ్‌!

తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాత‌గా చ‌లామ‌ణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వ‌ర‌కే త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. చిన్న‌, పెద్ద‌, స్టార్‌, కొత్త‌.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు. నిర్మాణ...

థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌లో మార్పులు వ‌స్తాయా?

క‌రోనా ముందు.. క‌రోనా త‌ర‌వాత‌..? - ప్ర‌స్తుతం ప్ర‌పంచం న‌డ‌వ‌డిక‌, మ‌నుషులు ఆలోచించే విధానం, బ‌తుకులు రెండు ర‌కాలుగా విడిపోయాయి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మార్పులు అనివార్యం. సినిమా కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నింటికంటే...

HOT NEWS

[X] Close
[X] Close