వ్యాక్సిన్ ధైర్యం నిల్.. మళ్లీ దేశంలో కరోనా ఆంక్షలు..!

దేశంలో కరోనా భయం హైస్పీడ్‌లో పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా.. కేసులు జెట్ స్పీడ్‌తో పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు… కరోనా ఆంక్షలు విధించాయి. తాజాగా తెలంగాణ సర్కార్.. విద్యాసంస్థల్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. కేజీ నుంచి పీజీ అన్ని విద్యా సంస్థలూ మూసేస్తున్నారు. ఆన్ లైన్ క్లాసులు మాత్రం చెప్పుకోవచ్చు. మెడికల్ కాలేజీలకు మినహాయింపునిచ్చారు. ఇటీవలి కాలంలో తెలంగాణ స్కూళ్లు, కాలేజీల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమయింది. స్కూళ్లను తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో కేంద్రం కూడా కొత్త జాగ్రత్తలు తీసుకుంది. ఏప్రిల్ నెల మొత్తం.. ప్రత్యేకమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించారు.

టెస్ట్, ట్రాక్, ట్రీట్ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలకు కేందత్రం స్పష్టమైన సూచన చేసింది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని .. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను 70శాతానికి పెంచేలా చూడాలని స్పషఅటం చేసింది. మళ్లీ కంటోన్మెంట్ జోన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికైతే.. ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నలభై ఐదేళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా విపరీతంగా పెరుగుతున్నందున వీలైనంత మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రాలకు కూడా అదే సమాచారం పంపారు. కొద్ది రోజుల కిందట వరకూ కరోనా భయం అంతం అయిపోయిందని అనుకున్నారు.

కానీ అనూహ్యంగా గత ఏడాది ఏ సమయంలో అయితే కరోనా ఉద్ధృతి పెరిగిందో.. ఈ సారి కూడా అదే సమయలో.. మళ్లీ కరోనా బుసలు కొడుతోంది. కేంద్రం ఏప్రిల్ నెల పరిస్థితిని బట్టి… ఆంక్షల్ని మరింత పొడిగించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా.. ఆంక్షలను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కరోనా లాక్ డౌన్ నాటి పరిస్థితులు మళ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close