ఇక “ఏపీ”లో ఉక్కు రాజకీయాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యకహోదాపై పోరాటాలకు కాస్తంత విరామం వచ్చింది. ఆ స్థానంలోకి కొత్తగా “ఉక్కు పరిశ్రమ” సాధన వచ్చిచేరింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో… కడప జిల్లాల్లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావన ఉంది. దీనికి సంబంధించి కేంద్రం కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టంలో ఉన్నట్లుగా పరిశీలన జరిపామని… అక్కడ ఉక్కు పరిశ్రమ పెట్టడం లాభదాయం కాదని నివేదిక వచ్చిందని తెలిపింది. ఫైనల్‌గా అసాధ్యమని తేల్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి రగిలిపోయింది.

నిజానికి ఈ నాలుగేళ్లలో… ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతలు..అదిగో ..ఇదిగో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేస్తోందని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సెయిల్‌కు చెందిన నిపుణుల కమిటీ… అసాధ్యమని నివేదిక ఇచ్చినా.. ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ మెకాన్‌ అనే సంస్థతో ప్రత్యక్ష పరిశీలన చేయించింది. ప్రభుత్వాల సహకారం గురించి ఆరా తీసింది. ఏపీ ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, భారీ పరిశ్రమలకు ఇచ్చే ప్రొత్సాహకాలు ఇస్తామని స్పష్టమైన హామీలతో..దానికి సంబంధించిన పత్రాలను కూడా పంపింది. దాంతో మెకాన్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. కానీ కేంద్రం ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పకుండా.. ఎప్పుడో మూడున్నరేళ్ల క్రితం ఇచ్చిన సెయిల్‌ నివేదికను మాత్రమే అఫిడవిట్‌గా సమర్పించింది.

ఉక్కుపరిశ్రమ రాకుండా చేయడానికే కేంద్రం కుట్రలు పన్నుతోందని… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థం అయింది. రాజకీయ పరంగా.. వారు పోరాటాలు ప్రారంభించారు. కడప జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆమరణదీక్ష చేస్తున్నారు. రెండు రోజుల ముందు నుంచే ఆయన కేంద్రానికి లేఖల రూపంలో ఘాటుగా హెచ్చరికలు పంపారు. కడప జిల్లా ప్రజల డిమాండ్‌ను వినిపించారు. కడప జిల్లా ప్రజల్లో కూడా ఇప్పుడు ఉక్కుపరిశ్రమ సెంటిమెంట్ గా మారింది. అందుకే వైసీపీ నేతలు కూడా… సీఎం రమేష్ ఆమరణదీక్షకు పోటీగా… మంగళవారం నుంచే 48 గటల నిరాహారదీక్ష ప్రారంభించారు.

ఇక ప్రజాసంఘాలు, ఇతర పోరాట సమితుల హడావుడి కూడా… ప్రారంభం కానుంది. రానున్న కొద్ది రోజుల్లో… కడప జిల్లాలో ప్రారంభమవనున్న ఈ ఉక్కుపోటీలు… రాష్ట్ర వ్యాప్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకహోదాలా సెంటిమెంట్‌గా మారనుంది. అయితే బీజేపీ నేతలకు మాత్రం ఈ పరిణామం ఇబ్బందికరంగా మారనుంది. ఢిల్లీ నేతలు.. ఏపీపై వెటకారంగా మాట్లాడుతూంటే.. ఇక్కడి వారు మాత్రం స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేస్తోందనే చెబుతున్నారు. ఎలా వస్తుంది..? ఎప్పుడు వస్తుందని మాత్రం చెప్పడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close