ఏపీ ఐటీ దాడుల వెనుక చాలా కథ ఉందా..?

ఎన్నికల సమయంలో.. ప్రభుత్వంలో ఉన్న పార్టీకి.. కొన్ని అడ్వాంటేజ్‌లు ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్పటి వరకూ నడిపించారు కాబట్టి… అధికార పార్టీకి వాళ్లు కాస్త ఫేవర్‌గా ఉంటారన్న అభిప్రాయం ఉంది. ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కానీ బయట నుంచి మాత్రం.. పూర్తి మద్దతు వైసీపీకి లభిస్తోంది. అందుకే ఏపీ అధికారపక్షం టీడీపీ అనేక ఇబ్బందులు పడుతుంది. టీడీపీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు. ఐటీ దాడులు చేయిస్తున్నాయి. ఇంకా అనేక రకాల ఒత్తిళ్లను టీడీపీ ఎదుర్కొంటోంది. ఇప్పుడు…టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక మద్దతు దొరకకుండా చేసేందుకు ఢిల్లీ స్థాయిలో అన్ని ప్రయత్నాలు పూర్తయిపోయాయట.

ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది పడకుండా టీడీపీ… ఇలాంటి దాడుల విషయాన్ని ముందుగానే ఊహించింది. కర్ణాటక, తెలంగాణా ఎన్నికల సందర్భంగా ప్రత్యర్ధి వర్గాలపై జరిగిన ఐటీ దాడులను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్దులందరినీ ఈ సందర్భంగా అప్రమత్తం చేసింది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే ఐటీ దాడులు జరుగుతాయని తెలిసిపోయింది. అప్పట్లో కొంత మంది టీడీపీ ముఖ్య నేతలపై దాడులు చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు అవసరం ఎక్కువుగా ఉండటం, మరికొన్ని నియోజకవర్గాలలో నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. పోలింగ్ తేదీ కూడా సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ఐటీ దాడులు జరుగుతాయంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు కలకలం రేకెత్తిస్తున్నాయి. దాడులు నిర్వహించేందుకు రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలలో ఐటీ బృందాలు సిద్దంగా ఉన్నాయని చెబుతున్నారు. తొలుత వైసీపీకి చెందిన ఒకరిద్దరు అభ్యర్దులపై డమ్మీ దాడులు నిర్వహించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్దుల వ్యాపార సంస్థలు, గృహాలపై దాడులు జరిగే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలకు సమాచారం అందింది.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, నువ్వా నేనా అనే రీతిలో పోరాడుతున్న నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్దులను గుర్తించి వారిపై దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల నైతిక స్థైర్యం దెబ్బతీయవచ్చని, అత్యంత విలువైన ప్రచార సమయంలో రెండు, మూడు రోజుల పాటు అభ్యర్ది దాడుల కారణంగా ఐటీ అధికారుల ఎదుట కూర్చోవాల్సి వస్తుందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ఆర్ధికపరమైన చికాకులతో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా నైతికంగా దెబ్బ తింటుందని, ఇటువంటి లక్ష్యాలను సాధించడం కోసమే ఐటీ దాడులను చేయించేందుకు తెకగబడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close