చిరు 150.. అదిరిపోయే ట్విస్టు

చిరంజీవి 150వ సినిమాకి సంబంధించి…. ఈ రెండు మూడేళ్ల‌లో ఎన్ని వార్త‌లో! ఓ సినిమా గురించి అభిమానులు, సినీ ప‌రిశ్ర‌మ ఇంత‌లా మాట్లాడుకోవ‌డం అరుదైన విష‌య‌మే. ఇప్పుడు చిరు సినిమాకి సంబంధించే మ‌రో.. ఫ్లాష్ లాంటి వార్త ఇది. చిరంజీవి త‌న 150వ సినిమాగా క‌త్తిని రీమేక్ చేయాల‌నుకొన్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడా స్ర్కిప్టుని ప‌క్క‌న పెట్టిన‌ట్టు టాక్‌. క‌త్తి స్ర్కిప్టునే తెలుగులో త‌ర్జుమా చేస్తున్న వినాయ‌క్‌… దానికి స‌మాంత‌రంగా మ‌రో రెండు క‌థల్ని కూడా త‌యారు చేశాడ‌ట‌. క‌త్తి కంటే.. వినాయ‌క్ వినిపించిన కొత్త క‌థ‌లే చిరంజీవికి బాగా న‌చ్చాయ‌ట‌. అందుకే.. క‌త్తిని ప‌క్క‌న పెట్టాల‌ని డిసైడ్ అయిన‌ట్టు టాక్‌. ఇప్పుడు వినాయ‌క్ త‌న సొంత క‌థ‌పై క‌స‌ర‌త్తులు మొద‌లెట్టాడ‌ట‌.

చిరంజీవికి ముందు నుంచీ క‌త్తి రీమేక్ పై కొన్ని అనుమానాలున్నాయి. అవి రోజు రోజుకీ బ‌ల‌పడుతూ వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా సెకండాప్ చిరు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా లేక‌పోవ‌డంతో వినాయ‌క్ ప‌లు మార్పులు చేశాడు.కానీ.. చిరుకి అవేం సంతృప్తిగా అనిపించ‌లేదు. ఇష్టం లేని క‌థ‌ని బ‌ల‌వంతంగా రుద్ద‌డం ఎందుకు అని చిరుకి కొత్త క‌థ వినిపించాడు వినాయ‌క్‌. అదికాస్త వ‌ర్క‌వుట్ అయ్యేలా ఉంది. 150వ సినిమా మొద‌ల‌య్యేలోగా ఇంకెన్ని ట్విస్టులు ఎదుర‌వుతాయో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close