బీహార్‌ బాటలో తెలంగాణ ఇంటర్ బోర్డ్…! విద్యార్థులకు ఆత్మహత్యలే దిక్కా..?

బీహార్‌లో ఓ ప్లస్ టూ క్యాండిడేట్ ఎగ్జామ్ టాపర్…! ఆ టాపర్ సంచలనం సృష్టించారని మీడియా ఇంటర్యూలు తీసుకోవడానికి వెళ్లింది. ఆమె సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్…. దాని గురించి ఆమె చెప్పింది ఏమిటంటే.. అది వంటల శాస్త్రమట. దీంతో జర్నలిస్టులకు మైండ్ బ్లాంక్ అయింది. బీహార్ పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు… తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా.. అదే పంథాలో ఉంది. అయితే.. బీహార్‌లో అత్యధికంగా మార్కులు వేస్తే.. తెలంగాణలో మాత్రం తీసేశారు. మొదటి ఏడాది 90 మార్కులు తెచ్చుకున్న వారికి రెండో ఏడాది జీరో మార్కులు వేశారు. కొన్ని వేల మంది లబోదిబోమంటున్నా…. మేమంతా కరెక్టే అంటున్నారు అధికారులు. పాసవుతామన్న నమ్మకంతో ఉండి ఫెయిలయిపోయిన విద్యార్థులు.. ప్రాణాలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో ఇప్పటికి పది మందికి పైగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో… ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు కూడా ఉన్నారు. ఒకరో ఇద్దరికో ఈ సమస్య వస్తే.. అది వారి సమస్య అనుకునేవారు. కానీ వేల మందికి వస్తే అది ఇంటర్ బోర్డు సమస్యే. ఇంటర్‌ మార్కుల్లో అవకతవకలు జరిగాయంటూ…పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. మార్కులు తారుమారయ్యాయని వారి ఆందోళన. ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్లే విద్యార్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్దకం చేశారంటూ ఇంటర్ బోర్డ్ ముందు కన్నీరు మున్నీరవుతున్నారు.

పరీక్షల్లో ఎప్పుడూ మంచి స్కోర్ సాధించే తమకు అతి తక్కువ మార్కులు రావడంతో పలువురు విద్యార్ధులు తీవ్ర మనోవేదనతో ఉన్నారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అంటున్నారు. పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్‌గానే సాగిందన్నారు. ఏమైనా అనుమానాలుంటే రికౌంటింగ్‌కు వెళ్లండంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరీక్షల్లో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఎంసెట్ పేపర్ లీకేజీ కూడా అయింది. ఆ కేసు తేలలేదు. ఇప్పుడు… ఇంటర్ మార్కుల సంగతి కలకలం రేపుతోంది. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. విద్యామంత్రి లైట్ తీసుకున్నారు. తమ తప్పు లేకపోయినా.. తమ భవిష్యత్ ను గందరగోళంలోకి వెళ్లిపోవడంతో విద్యార్థులే ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close