తెలుగు రాష్ట్రాలకు రిలీఫ్ ఇచ్చిన వర్షాలు!

హైదరాబాద్: ఉన్నట్లుండి నైరుతి రుతుపవనాలు చురుకుగా మారటంతో కురిసిన వర్షాలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో నీటి కొరతను తీర్చాయి. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక జలాశయాలు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, సుంకేశుల, తుంగభద్ర రిజర్వాయర్‌లు పొంగి పొర్లుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరా, సింగూర్ రిజర్వాయర్‌లలోకి భారీవర్షాల వలన పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ఇక నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో ఈ వర్షాల పుణ్యమా అని కరవు పరిస్థితులు తొలగిపోయినట్లే. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని సుమారు 175 చెరువులు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 249 మి.మీ. కాగా గత మూడురోజులు కురిసిన వర్షాలతో అది 251 మి.మీ.కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక వర్షపాతం విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో – 7 సెం.మీ.గా, దాని తర్వాత చిత్తూరు జిల్లాలో వెంకటగిరి కోటలో 6 సెం.మీ.గా నమోదయింది. ఇక తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ పోచలో అత్యధికంగా 10 సెం.మీ., దాని తర్వాత నల్గొండజిల్లా సూర్యాపేట మండలంలో 8 సెం.మీ. వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌ నగరంలో ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవటం, ట్రాఫిక్ వంటి సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ, నగరానికి నీరందించే రిజర్వాయర్లు నిండుతాయని, భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని ప్రజలు సంతోషపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close