‘సైరా’లో చిరు త‌ర‌వాతి స్థానం త‌న‌దేన‌ట‌!

‘సైరా’పై మెగా అభిమానులు చాలా ఆశ‌లున్నాయి. దాదాపుగా 200 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. తొమ్మిదేళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే 150 కోట్లు కొల్ల‌గొట్టాడు చిరు. ‘సైరా’ 200 కోట్ల‌కు మించి వ‌సూలు చేస్తుంద‌ని చిత్ర‌బృందం న‌మ్ముతోంది. పైగా ఈ సినిమాలో స్టార్ల‌కు ఏమాత్రం కొద‌వ‌లేదు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, విజ‌య్‌సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు… ఇలా చాలామంది స్టార్లు క‌నిపించ‌నున్నారు. అయితే చిరంజీవి త‌ర‌వాత‌… అంత శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో క‌నిపించేది సుదీప్ అని, సుదీప్ న‌ట‌న‌.. ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంద‌ని స‌మాచారం అందుతోంది.

‘ఈగ‌’ త‌ర‌వాత ‘బాహుబ‌లి’లోనే సుదీప్ కనిపించాడు. ఈమ‌ధ్య త‌న‌కు చాలా అవ‌కాశాలొచ్చాయి. కానీ దేన్నీ ఒప్పుకోలేదు. ‘సైరా’లో మాత్రం చాలా శ‌క్తిమంత‌మైన పాత్ర ద‌క్కింద‌ట‌. అందులో… సుదీప్ విజృంభించాడ‌ని, చిరంజీవి – సుదీప్ మ‌ధ్య వ‌చ్చిన స‌న్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. క‌న్న‌డ‌లో సుదీప్‌కి మంచి మార్కెట్ ఉంది. `సైరా`ని క‌న్న‌డ‌లో విడుద‌ల చేస్తే… సుదీప్ అభిమానుల వ‌ల్ల వ‌సూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఓ విధంగా సుదీప్ మార్కెట్ ప‌రంగానూ `సైరా`కి ప్ల‌స్ అవ్వ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close