విల‌న్ పాత్ర‌ల‌కు రెడీ

క‌థానాయ‌కులు ప్ర‌తినాయ‌డి పాత్ర‌ల్లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆది పినిశెట్టి… స‌రైనోడులో విల‌న్‌గా క‌నిపించాడు. రానా కూడా బాహుబలిలో అద‌గొట్టేశారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా ‘నేనూ రెడీ’ అంటున్నాడు. ఎస్సెమ్మెస్ సినిమాతో ఆక‌ట్టుకొన్న క‌థానాయ‌కుడు సుధీర్ బాబు. ప్రేమ‌క‌థా చిత్రమ్‌తో తొలి హిట్ అందుకొన్నాడు. మాస్ హీరోగా నిల‌బ‌డే ప్ర‌య‌త్నాలు చేస్తూనే బాలీవుడ్‌లో బాఘి సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా… సుదీర్‌కి మాత్రం మంచి పేరొచ్చింది. అందుకే ఇప్పుడు తెలుగులోనూ ఆ త‌ర‌హా పాత్ర‌లు చేయ‌డానికి సిద్ధ‌మే అంటున్నాడు.

”బాఘి సినిమాలో నా న‌ట‌న‌కు మంచి స్పందన వ‌స్తోంది. త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌లాంటి వాళ్లు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నిజానికి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చిన‌ప్పుడు ఏదో చిన్న పాత్ర కోసం పిలిచార‌నుకొన్నా. వెళ్తే.. విల‌న్ వేషం ఇచ్చారు. ఆ పాత్ర‌కు ఇంత మంచి స్పంద‌న వ‌స్తుంద‌నుకోలేదు. తెలుగులోనూ విల‌న్ గా న‌టించే అవ‌కాశాలొస్తే అస్స‌లు వ‌దులుకోను. క‌థానాయ‌కుడిగా నా మైలేజీ త‌గ్గిపోతుంద‌న్న భయం లేదు. న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మే నా ముందున్న ల‌క్ష్యం” అంటున్నాడు. మ‌రి తెలుగులో సుధీర్‌బాబుకి అలాంటి పాత్ర‌లు ఎవ‌రిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close