మ‌హేశ్‌ది ‘ఎమ్‌బి’… అత‌ని బావ‌ది ‘ఎస్‌బి’

మ‌హేశ్‌బాబుని ఫాలో అవుతూ… మ‌హేశ్‌తో పాటు సూప‌ర్‌స్టార్‌ కృష్ణని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకొని ఇండస్ట్రీలో హీరోగా వచ్చేశాడు అతని బావ సుధీర్‌బాబు. ప్రొడక్షన్‌లో రావడంలోనూ, ప్రొడక్షన్ హౌస్ పేరు పెట్టడంలోనూ మ‌హేశ్‌ని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకున్నట్టున్నాడు. ‘మ‌హేశ్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి’ తన ప్రొడక్షన్ హౌస్‌కి మహేశ్ పేరు పెట్టాడు. షార్ట్‌క‌ట్‌లో ‘ఎమ్‌బి’ అని పెట్టాడు. సుధీర్‌బాబు తన ప్రొడక్షన్ హౌస్‌కి ‘ఎస్‌బి’ అని పేరు పెట్టాడు. అంటే సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ అన్నమాట. శనివారం రాత్రి ఈ ప్రొడక్షన్ హౌస్ లోగోని ఆవిష్కరించారు. లోగోలు కూడా ఇంచుమించు ఒకలానే వున్నాయి. యాక్టింగ్ కెరీర్లో తనకు పరిచయమైన చాలామంది సరైన అవకాశాలు రాక కలలను చంపేసుకుని తిరిగి సొంతూళ్లు వెళ్లినవాళ్ళని, వేరే రంగంలోకి చూశానని, ఎప్పుడైనా తనకు అవకాశం వస్తే నిర్మాణ సంస్థ అటువంటి వాళ్లతో సినిమా చేయాలని అనుకున్నానని… అందుకే, నిర్మాణ సంస్థ ప్రారంభించానని సుధీర్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలో హేమాహేమీలైన నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, యువి క్రియేషన్స్ ప్రమోద్, వంశీ తదితరులతో పాటు హీరోల్లో సుధీర్‌బాబు స్నేహితులు కొందరు వచ్చారు. కాని అతని అత్తింటివారు కృష్ణ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close