బొత్స భూముల లెక్కలకు సుజనా కౌంటర్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని చాలా కాలంగా ఆరోపిస్తోంది. సవాల్ చేస్తే.. ఎవరి దగ్గర ఎన్నెన్ని వందల ఎకరాల భూములున్నాయో బయట పెడతామని సవాల్ చేశారు. దానికి సుజనా చౌదరి వెంటనే స్పందించారు. బయట పెట్టమన్నారు. వెంటనే.. బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి.. సుజనా చౌదరి భూములంటూ… కృష్ణా జిల్లాలో వీరులపాడు, చందర్ల పాడు మండలాల్లో ఉన్న భూముల వివరాలు ప్రకటించారు. ఇందులో.. ఓ కంపెనీ పేరు మీద.. 110 ఎకరాలు ఉన్నాయన్నారు. అది ఆయన అల్లుడి కంపెనీ అని బొత్స అన్నారు. మరో 14 ఎకరాలు.. సుజనా చౌదరి సోదరుడి కుమార్తె పేరు మీద ఉన్నాయన్నారు. ఇది చాలదా… అని .. బొత్స.. తన చాలెంజ్‌లో తానే గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు.

నిజానికి రాజధాని ప్రాంతంలో.. టీడీపీ నేతలు వందల ఎకరాలు కొన్నారనేది.. చేస్తున్న ఆరోపణ. కృష్ణా జిల్లా చందర్ల పాడు, వీరులపాడు మండలాలు.. అమరావతికి కనీసం వంద కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఓ రకంగా అవి నల్లగొండ జిల్లా బోర్డర్. వాటిని రాజధాని భూములుగా బొత్స చెప్పడమే చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. రాజధాని పరిధిలో అన్నారు కదా… ఆ భూముల వివరాలు చెప్పమని.. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. మీకెందుకు కంగారు అని.. బొత్స దబాయించి.. వారి నోరు మూసేశారు. బొత్స తీరుపై.. సుజనా చౌదరి సింపుల్‌గానే సెటైర్లు వేశారు. బొత్స భాషా ప్రావీణ్యాన్ని అర్థం చేసుకోవడం కష్టమేనన్నారు. కృష్ణాజిల్లాలో తనకు ఉన్నాయని చెబుతున్న భూములు ఎప్పుడు.. కొన్నానో కూడా చెప్పాలని.. ఆయన పిలుపునిచ్చారు.

బొత్స మాటలు.. సుజనా చౌదరి రియాక్షన్.., రాజకీయానికే. అయితే.. ఇప్పటి వరకూ.. వైసీపీ ఆరోపించినట్లుగా.. సుజనా చౌదరికి.. రాజధాని అమరావతి ప్రాంతంలో.. గజం కూడా భూమి లేదని… ప్రభుత్వమే బొత్స రూపంలో ప్రజలకు చెప్పినట్లు అయిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. నిజంగా.. సుజనా చౌదరికి భూములు ఉంటే.. బయట పెట్టడానికి ఎందుకంత… ఆలస్యమని.. అనుమానం ప్రజల్లో వస్తుంది. 2014 నుంచి రాజధాని ప్రాంతంలో ఎవరెవరు భూములు కొన్నారో ప్రభుత్వం వద్ద… సమాచారం ఉంటుంది. బయట పెట్టాలనుకుంటే క్షణాల్లో పని. తమ దగ్గర ఏ ఆధారం లేకపోతేనే.. సమయం వచ్చినప్పుడు బయట పెడతామని.. రాజకీయ నేతలు తప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు బొత్స.. ఏపీ సర్కార్ కూడా.. అదే వ్యూహాన్ని అమలు చేస్తోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close