ఏపీ రాజ్యసభ: దట్ ఈజ్ సుజనా చౌదరి

ఏపీ పెద్దల సభ విషయంలో సుజనా చౌదరికి సీటు కేటయింపుపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సుజనాకు సీటు ఇవ్వరని… సుజనాపై వస్తున్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ నేతలు చెప్తూ వచ్చారు. అయితే సుజనా విషయంలో బాబుకు ఆప్షన్ లేదన్నది నిర్వివాదం. గత ఎన్నికల్లో టీడీపీకి సుజనా ఏం చేశారో, బాబుకు బాగా తెలుసు. పార్టీ నేతలకూ, మరీ ముఖ్యంగా లోకేష్ కు తెలుసు. అందుకే సుజనా విషయంలో బాబుది మొదట్నుంచి మెతకవైఖరే… అందుకు కారణాలు కొకొల్లలు. పార్టీలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా… నేనున్నానంటూ ఆయన ముందుకు వస్తారు. ఏం కావాలో చెప్పండని బాబును డైరెక్టుగా అడిగేస్తాడు.

ఒకవైపు టీవీ చానెల్ (ఇన్ డైరెక్టుగా) తోనూ, మరోవైపు ఆర్థికంగాను టీడీపీకి పూర్తి స్థాయిలో సపోర్టు ఇస్తున్న సుజనాకు రాజ్యసభ కేటాయింపు విషయంలో అనేక అంశాలు ప్రచారంలోకి వచ్చాయ్. బ్యాంకుల నుంచి లోన్లకు సంబంధించి సుజనా విమర్శలెదుర్కొంటున్నారని, ఆర్థిక నేరగాడన్న విమర్శలు విన్పించాయి. అలాంటప్పుడు సుజనాకు చంద్రబాబు మద్దతు ఉండదని అందరూ భావించారు. ఎందుకంటే ఎవరిమీదైనా విమర్శలు వస్తే వారిని బాబు దూరంగా పెడతారని ప్రచారం ఉంది. అయితే మారిన బాబు పంథా ప్రకారం పార్టీ కోసం, తన కోసం పనిచేసిన నేతలను రక్షించుకోవాలని బాబు కూడా డిసైడ్ అయ్యారేమో? పరిస్థితి చూస్తుంటే… అది నిజమే అనుకోవాలేమో? అలా బాబు అనుకోబట్టే సుజనాకు రాజ్యసభ పీఠం దక్కింది.

సుజనా చౌదరి తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతారు. పెద్దగా మీడియా వార్తల్లోకి రారు. ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటూ… తనదైన మార్కు చూపిస్తుంటారు. లోకేష్ కు, సుజనాకు చెడిందని…. అందుకే మారిషస్ బ్యాంకు వ్యవహారంలో ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు పలికే టీవీ చానెళ్లో, సుజనాకు వ్యతిరేక వార్తలు వచ్చాయని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వర్గాలు చెవులు కొరుక్కునేవి. అయితే లోకేష్ ను బిజినెస్ మ్యాన్ గా రూపాంతరం వెనుక సుజనా పాత్ర ఉందని ఆయనకు దగ్గరగా ఉండే పలువురు చెప్తుంటారు. సో… సుజనా విషయంలో లోకేష్ కు ఆప్షన్ లేదు… లోకేష్ కూడా సుజనా విషయంలో వ్యతిరేక ధోరణిలో ఉండటానికి అవకాశమూ లేదు. కేవలం మీడియా వర్గాల గుసగుసలే, ఇద్దరికీ గ్యాప్ ఉందని ప్రచారం చేశాయ్.

మనీ మేనేజ్మెంట్ తెలిసిన సుజనాకు రుణమాఫీ చెల్లింపు విషయంలో, రాజధానికి నిధులు విషయంలో కీలక కమిటీల్లోనూ భాగస్వామిని చేసిన చంద్రబాబు, సుజనా విషయంలో మరోలా ఎలా వ్యవహరిస్తారు? ప్రచారం చేసినోళ్లకు, బాబు మైండ్ సెట్ తెలియదనుకోవాలి. తనకు హైదరాబాద్, బెజవాడల్లో పెద్ద ఎత్తున కోటరీ ఉన్నా… పదవులు విషయంలో బాబుపై సుజనా ఎప్పుడూ పెద్దగా ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదు. ఢిల్లీ పెద్దలతో కీలక చర్చల్లో భాగస్వామిగా ఉంటూ… ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య సమస్యలు రాకుండా చూడటంలో సుజనా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు భారీగా వస్తున్నాయని… వచ్చాయని అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మీరీ వివరించారు. ఆ ఘనతంతా బాబుకు, మోదీకి దక్కుతుందని అంటారు. ఇదంతా సుజనుడి కష్టార్జితమని ఆయన అభిమాన పార్టీ నేతలు మీడియా ముందు చెప్తూ ఉంటారు. సుజనా అటు బీజేపీకి, ఇటు టీడీపీకి మధ్య వారధి. భవిష్యత్ లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు వస్తాయో ఎవరికీ తెలియదు. ఆ విషయంలో బాబుది ఫుల్ క్లారిటీ… ఒకవైపు జాతీయ రాజకీయాల్లోకి వస్తామంటూ చెబుతూనే మరోవైపు బీజేపీతోనూ ఇప్పటికిప్పుడు తెగదాక లాగకూడాదనే వర్షన్ టీడీపీది.

కొసమెరుపేంటంటే… రాజ్యసభ సీట్ల కోసం రెండు మీడియా గ్రూపుల అధినేతలు కూడా ట్రై చేశారని చెబుతారు. జర్నలిస్టుగా ఉండి మీడియా సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న కీలక వ్యక్తితోపాటు, అనూహ్యంగా రేటింగ్ తెచ్చుకునే చానెల్ యజమాని పెద్దల సభకు ట్రై చేశారని వార్తలు వచ్చాయ్. అది నిజమే అయితే ప్రస్తుతానికి వారికి నిరాశే అనుకోవాలి. సమయానికి తగు విధముగా వ్యహరించే సుజనుడి వ్యూహాలు మీడియా అధిపతులకు తెలియనవి కావు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close