సుజనా గ్రూప్‌తో సంబంధం లేదన్న సుజనా చౌదరి

హైదరాబాద్: మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. తనకు ఎలాంటి సమన్లూ అందలేదని ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు. రుణం తీసుకున్నపుడు తాను సంతకం కూడా చేయలేదని అన్నారు. ఆ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న సుజనా గ్రూప్ సంస్థలో తాను డైరెక్టర్‌ను కూడా కానని చెప్పారు. సమన్లు జారీ చేయటం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడికైనా సమన్లు ఇవ్వొచ్చని అన్నారు. రు.100 కోట్లకు రుణం తీసుకుని మోసం చేశారంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ పెట్టిన కేసులో హైదరాబాద్ 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ తనకు జారీ చేసిన సమన్లపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు. ఈ విషయంపై ప్రశ్న అడిగిన విలేకరిపై విసుక్కుంటూ ప్రెస్ మీట్ నుంచి లేచి వెళ్ళిపోయారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందిస్తూ, విభజన హామీలు అమలు కాకపోతే రాజ్యాంగాన్ని గౌరవించనట్లేనని చెప్పారు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పామని పేర్కొన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ను ఈ రైల్వే బడ్జెట్‌లోనే ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమరావతి ప్రాంతంలో భూకంప ప్రభావాలపై కమిటీ వేశామని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయాలో ఆ కమిటీ అధ్యయనం చేసి సూచనలు ఇస్తుందని మంత్రి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close