పాట‌ల ప‌ని పూర్తి చేయాల‌నుకుంటున్న ‘పుష్ప’

లాక్ డౌన్ నుంచి షూటింగుల‌కు అనుమ‌తులు వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక‌ట్రెండు చిన్న సినిమాలు త‌ప్ప‌…. ఏ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. అగ్ర హీరోలెవ‌రూ షూటింగుల‌కు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో అనుకున్న మేర‌కు షూటింగులు మొద‌ల‌వ్వ‌లేదు. అయితే… స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఇప్పుడు ముంద‌డుగు వేశాడు. త‌న కొత్త సినిమా `పుష్ప` షూటింగ్‌కి బ‌న్నీ రెడీ అవుతున్నాడు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అడ‌వుల్లో ఈ సినిమా కోసం ఓ ప్ర‌త్యేక‌మైన సెట్ తీర్చిదిద్దే స‌న్నాహాల్లో ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈలోగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం మ‌రో సెట్ వేస్తున్నారు. అందులో ఓ పాట తెర‌కెక్కిస్తారు. బ‌న్నీ, ర‌ష్మిక‌ల‌పై డ్యూయెట్ తోనే `పుష్ప` షూటింగ్ మొద‌లు పెట్ట‌బోతున్నట్టు స‌మాచారం. ప‌రిమిత‌మైన క్రూతో షూటింగులు మొద‌లెట్టాల‌న్న నిబంధ‌న‌లు ఉండ‌డంతో ముందుగా పాట‌ల్ని పూర్తి చేయాల‌ని సుకుమార్ భావిస్తున్నాడు. ఇప్ప‌టికే దేవిశ్రీ ప్ర‌సాద్ నాలుగు పాట‌ల్ని కంపోజ్ చేసి రెడీగా పెట్టాడు. అందుకే ముందు పాట‌ల ప‌ని ప‌ట్టాల‌న్న‌ది ప్లాన్‌. జులై మొద‌టి వారంలో `పుష్ప` కొత్త షెడ్యూల్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close