సుకుమార్ మైన‌స్ అదే

సుకుమార్‌… మ‌న‌కున్న బ్రిలియెంట్ ద‌ర్శ‌కుల్లో ఒక‌డు. సుక్కు సినిమాల్లో లాజిక్‌తో మ్యాజిక్ చేసే విధానం అంద‌రికీ న‌చ్చుతుంది. అందుకే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఫాలోయింగ్ ఉంది. త‌న చేతిలో మంచి విజ‌యాలు కూడా ఉన్నాయి. కాక‌పోతే… సుక్కు మైన‌స్ ఒక్క‌టే. బీ,సీల్లో సుకుమార్ సినిమాల‌కు అంత‌గా టికెట్లు తెగ‌వు. సుకుమార్ సినిమాని ప‌దే ప‌దే చూసే జ‌నం అక్క‌డ అంత‌గా ఉండ‌రు. సుక్కు మార్కెట్ `ఏ` సెంట‌ర్ల‌కు, మ‌ల్టీప్లెక్స్‌కీ ప‌రిమితం అయిపోయింది. అదే.. `రంగ‌స్థ‌లం`పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ సినిమా అంటే.. బీ.సీల్లో మోత మోగిపోవాల్సిందే. కానీ సుకుమార్‌కి అక్క‌డ అలాంటి రికార్డ్ లేదు. పైగా.. రీషూట్లు జ‌రిగాయ‌ని, సుకుమార్‌కి తాను తీయ‌బోయే స‌న్నివేశాల‌పై అంత‌గా క్లారిటీ ఉండ‌ద‌ని… ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాలు వినిపించిన నేప‌థ్యంలో.. ఆ దెబ్బ ‘రంగ‌స్థ‌లం’పై ప‌డింది. సినిమా పూర్తి కావొస్తున్నా బిజినెస్ గంట మోగ‌లేదు. ఫ్యాన్సీ రేట్ల ఆఫ‌ర్లూ అంద‌లేదు. నిర్మాత‌లు చెబుతున్న రేట్ల‌కు బ‌య్య‌ర్ల‌లో కంగారు మొద‌లైంది. దాంతో… రంగ‌స్థ‌లం సినిమాని వాళ్లంతా లైట్ తీసుకుంటున్నారు. కాక‌పోతే.. ‘రంగ‌స్థ‌లం’ సుకుమార్ బీ, సీ సెంట‌ర్ల‌ను టార్గెట్‌గా చేసుకుని తీసిన సినిమా అని అర్థ‌మ‌వుతోంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. బీ,సీ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన అన్ని అంశాల్ని జాగ్ర‌త్త‌గానే పొందుప‌రిచాడ‌ని టాక్. కానీ.. మాస్‌కి ఎప్ప‌ట్లానే సుకుమార్ సినిమా ఎక్క‌దేమో అని బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు. ఈ లెక్క‌ల‌న్నీ చెరిపేయాలంటే.. ‘రంగ‌స్థ‌లం’ బీసీలో అద‌ర‌గొట్టాలి. అప్పుడు గానీ.. సుకుమార్ పై ప‌డిన ఈ ముద్ర చెరిగిపోదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.