సుకుమార్ శిష్యుడు… గ‌ట్టోడే

రాఘ‌వేంద్ర‌రావు, దాస‌రి నారాయ‌ణ‌రావు… లాంటి దిగ్గ‌జాలు డ‌జ‌న్ల కొద్దీ శిష్య‌బృందాలు త‌యారు చేసుకున్నారు. ఇప్ప‌టికీ వాళ్లు క‌నిపిస్తూనే ఉంటారు. కానీ న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు మాత్రం చిత్ర‌సీమ‌కు కొత్త ద‌ర్శ‌కుల్ని ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఎందుకంటే ఒక‌రి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి, సినిమా గురించి మెళ‌కువ‌లు నేర్చుకుని, ఆ త‌ర‌వాత తీరిగ్గా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఓపిక ఇప్పుడు ఎవ‌రికీ ఉండ‌డం లేదు. అంద‌రూ షార్ట్ ఫిల్మ్ బ్యాచులే. ఎవ‌రి ద‌గ్గ‌రా, ఏమీ నేర్చుకోకుండానే సినిమాలు తీసేసే స్థాయికి చేరుకున్నారు.

అయితే సుకుమార్ నుంచి మాత్రం ఓ శిష్యుడు వ‌స్తున్నాడు. త‌నే… బుచ్చిబాబు. త‌న శిష్యుడిపై న‌మ్మ‌కంతో… సుకుమారే ఈ చిత్ర నిర్మాణంలో భాగం కూడా పంచుకున్నాడు. ఆ ప్రాజెక్టే `ఉప్పెన‌`. చాలా కాలంగా ఈ సినిమా సెట్స్‌పై ఉంది. బ‌డ్జెట్ ఎక్కువైపోయింద‌న్న కామెంట్లూ వినిపించాయి. ఎమోష‌న్లు కూడా హెవీ డోసు లో ఉండ‌బోతున్నాయట‌. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌లైన రెండు పాట‌లూ చూస్తుంటే.. ఈ సినిమాకి హిట్టు క‌ళ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. సినిమాపై పాజిటీవ్ టాక్ అప్పుడే మొద‌లైపోయింది. యూత్‌ని క‌ట్టిప‌డేసే మెటీరియ‌ల్ ఈ సినిమాలో ఉంద‌ని అర్థ‌మౌతోంది. అందుకే తొలి సినిమా ఇంకా విడుద‌ల కాకుండానే బుచ్చిబాబుకు ఆఫ‌ర్లు వ‌చ్చేస్తున్నాయి. ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా స‌రే, మైత్రీ మూవీస్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి ఒప్పందం కుదిరింద‌ట‌. అంతేకాదు.. యూవీ, గీతా ఆర్ట్స్ 2 సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించే చిత్రానికీ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని చెప్పుకుంటున్నారు. టీజ‌ర్ రాకుండానే ఇన్ని ఆఫ‌ర్లు అందుకున్నాడంటే, సినిమా విడుద‌లై, పాజిటీవ్ టాక్ వ‌స్తే… బుచ్చిబాబు మ‌హా బిజీ అయిపోతాడ‌న్న‌మాట‌. మొత్తానికి సుకుమార్ శిష్యుడు గ‌ట్టోడే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close