బాహుబ‌లికి వ‌డ దెబ్బ‌.. నెల రోజులు షూటింగ్ బంద్‌

ఎండ‌లు మండిపోతున్నాయి. సూర్యుడు రోజు రోజుకీ ఉగ్ర రూపం దాలుస్తున్నాడు. జ‌నాలు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డిపోతున్నారు. సినిమా షూటింగుల‌కూ ఎండ దెబ్బ త‌గులుతోంది. తాజాగా… బాహుబ‌లి టీమ్ ఎండ‌లకు హ‌డ‌లిపోతోంది. అందుకే రాజ‌మౌళి.. నెల రోజుల పాటు షూటింగ్‌కి సెల‌వలు ప్ర‌క‌టించేశారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో బాహుబ‌లి షూటింగ్ జ‌రుగుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్త‌వుతుంది. పూర్త‌యిన వెంట‌నే 30రోజ‌లు సెల‌వు ప్ర‌క‌టించారు. మే నెలాఖ‌రున మ‌ళ్లీ షూటింగ్ మొద‌లెడ‌తార‌ట‌.

అయితే ఈ సెల‌వ‌లు న‌టీన‌టుల‌కు మాత్ర‌మే అని తెలిసింది. సాంకేతిక నిపుణులు మాత్రం క‌ష్ట‌ప‌డాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ అయిన షూటింగ్‌కి సంబంధించిన ఎడిటింగ్‌, గ్రాఫిక్స్ ప‌నుల్ని ఈ సెల‌వుల్లో పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నారు. 2017 ఏప్రిల్‌లో బాహుబ‌లి 2 ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సివుంది. అలా అనుకొన్న టైమ్‌కి ఈ సినిమా రావాలంటే.. ఇప్ప‌టి నుంచే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా మొద‌లెట్టేయాలి. అందుకే రాజ‌మౌళి న‌టీన‌టుల‌కు సెల‌విచ్చి.. డ‌బ్బింగ్‌, రికార్డింగ్ థియేట‌ర్లో గ‌డ‌ప‌బోతున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close