ఉద‌య్ కిర‌ణ్‌ బ‌యోపిక్ చేయ‌డం లేద‌ట‌

రెండ్రోజుల నుంచీ ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ అనే వార్త సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగానే చ‌క్క‌ర్లు కొడుతోంది. ఉద‌య్ కిర‌ణ్‌గా సందీప్ కిష‌న్ క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఈ సినిమాకి సందీప్‌నే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై సందీప్ స్పందించాడు. ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ చేయ‌డం లేద‌ని, ఆ క‌థ‌తో త‌న‌ని ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని, ఇప్ప‌ట్లో బ‌యోపిక్‌లు చేసే ఉద్దేశం లేద‌ని క్లారిటీ ఇచ్చాడు.

కాక‌పోతే.. ఉద‌య్ కిర‌ణ్ క‌థ‌ని సినిమాగా తీయాల‌ని ఓ యువ ద‌ర్శ‌కుడు క‌థ ప‌ట్టుకుని తిరుగుతున్నాడు. సందీప్ కిష‌న్ అప్పాయింట్‌మెంట్ కూడా తీసుకున్నాడు. సందీప్‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపాడు. కాక‌పోతే.. సందీప్ త‌న నిర్ణ‌యాన్ని ఇంకా తెలియ‌ప‌ర‌చ‌లేదు. ఈ లోగా ఈ వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. దాంతో సందీప్ కాస్త సీరియస్ అయ్యాడ‌ని, అందుకే… ఈ సినిమాని వ‌ద్ద‌నుకుంటున్నాడ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సందీప్ కాక‌పోయినా, మ‌రొక‌రితో ఈ సినిమా చేయాల‌ని ఆ ద‌ర్శ‌కుడు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మ‌రి ఉద‌య్ కిర‌ణ్ దొరుకుతాడో, లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close