సందీప్‌ కిష‌న్ హీరోగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం ప్రారంభం

‘ప్ర‌స్థానం’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన యంగ్ హీరో సందీప్‌కిష‌న్‌. ‘రొటీన్ ల‌వ్‌స్టోరి’, ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘బీరువా’, ‘టైగ‌ర్’ వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌తో మంచి స‌క్సెస్‌లు సాధించారు. ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ‘All Indians are My Brothers and Sisters, ఒక్క అమ్మాయి త‌ప్ప’ చిత్రంలో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా ‘సినిమా చూపిస్త‌మావ’ వంటి సూప‌ర్ స‌క్సెస్ మూవీ నిర్మాత‌ల్లో ఒక‌రైన అంజ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు రాజ‌సింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌రైన స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయక్ తొలి స‌న్నివేశానికి క్లాప్‌ కొట్టగా ప్ర‌ముఖ నిర్మాత జెమిని కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ముహుర్త‌పు సన్నివేశానికి మ‌రో ప్ర‌ముఖ నిర్మాత అనిల్‌ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో…

హీరో సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ ‘‘2012లో దర్శకుడు రాజసింహ ఈ సినిమా కథ నాకు నెరేట్ చేశాడు. అంత‌కు ముందు వేరే క‌థ చెప్పినా అది నాకు న‌చ్చ‌లేదు. రెండో స్క్రిప్ట్ విన‌కూడ‌ద‌నుకుంటూనే విన్నాను. చాలా బాగా న‌చ్చింది. అంజిరెడ్డిగారికి కూడా సినిమా క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న ఈ సినిమాని చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు.ఇప్పటి వరకు కథను నమ్మి సినిమాు చేశాను. ఇప్పుడు కథతో పాటు, దర్శకుడిని కూడా నమ్మి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో తెలివైన కాలేజ్‌ కుర్రాడి కథ. హీరోయిన్ ఇంకా ఫైన‌ల్ కాలేదు. ల‌వ్ స్టోరి, త‌న ల‌వ్ కోసం హీరో ఎలాంటి స‌మ‌స్య‌లు ఫేస్ చేశాడు, దాన్ని ఎలా సాల్వ్ చేశాడ‌నేదే పాయింట్స్‌. మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిుస్తుంది’’ అన్నారు.

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ ‘‘మంచి కథ, మంచి టీమ్‌. అంజిరెడ్డిగారు నిర్మాత అనగానే చాలా కాన్ఫిడెంట్‌ వచ్చింది. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

దర్శకుడు రాజసింహ తాడినాడ మాట్లాడుతూ ‘‘సురేష్ ప్రొడ‌క్ష‌న్‌లో ప్రేమించుకుందాం రా చిత్రంతో రైట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యాను. త‌ర్వాత జయంత్‌ సి.పరాన్జీ, పరుచూరి బ్రదర్స్‌ దగ్గర రైటర్‌గా వర్క్‌ చేశాను. దర్శకుడిగా నా తొలి చిత్రం.ఈ సినిమాని మూడేళ్ళ క్రిత‌మే సందీప్‌కి చెప్పాను. సినిమాలో నభై ఐదు నిమిషా పాటు గ్రాఫిక్స్‌ ఉంటుంది. ఈ సినిమా కోసం ఫ్లై ఓవర్‌ సెట్‌ కూడా వేస్తున్నాం. ఈ నె 10 నుండి రెగ్య‌ల‌ర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. డిసెంబర్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తాం. కొత్త బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. సందీప్‌ కొత్త‌గా క‌నిపిస్తాడు’’ అన్నారు.

నిర్మాత బోగాది అంజిరెడ్డి మాట్లాడుతూ ‘‘హీరోగా సందీప్‌ సహా మంచి టీమ్‌ కుదిరింది. హీరోయిన్‌ ఫైనల్‌ కావాల్సి ఉంది. దర్శకుడు రాజసింహ చెప్పిన కథ చాలా బావుంది. సినిమా చూపిస్త‌మావ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ఈ సినిమా అంత‌కంటే మంచి విజ‌యాన్ని సాధించాలి’’ అన్నారు.

మిక్కి జె.మేయర్‌ మాట్లాడుతూ ‘‘రొటీన్ ల‌వ్‌స్టోరి సినిమా త‌ర్వాత నేను సందీప్‌తో చేస్తున్న రెండో మూవీ. మంచి హీరో, దర్శకుడు, నిర్మాత. మంచి అవుట్‌పుట్‌ వస్తుంది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

బ్రహ్మానందం, రవికిషన్‌, అలీ, తనికెళ్ళభరణి, రావు రమేష్‌, పృథ్వీ, సప్తగిరి తదితయి ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజసింహ తాడినాడ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close