సునీల్ బాగా హ‌ర్ట‌య్యాడు

సోష‌ల్ మీడియా వైఖ‌రి ప‌ట్ల సునీల్ బాగా హ‌ర్ట‌యిన‌ట్టు క‌నిపిస్తున్నాడు. ఇటీవ‌ల సునీల్ చ‌నిపోయాడంటూ ఓ వెబ్ సైట్‌లో వార్తొచ్చింది. అది నిజ‌మా? కాదా? అనేది కూడా ఎవ్వ‌రూ ఆలోచించ‌కుండా దాన్ని వైర‌ల్ చేశాడు జ‌నాలు. దీనిపై సునీల్ బాగా హ‌ర్ట‌య్యాడు. ”వ్యూస్ కోసం ఓ వ్య‌క్తిని బ‌ల‌వంతంగా చంపేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది?” అంటూ నిల‌దీస్తున్నాడు. ”ఈ విష‌యంపై చాలా బాధ ప‌డ్డాను. ఆ వ్య‌క్తిపై కేసు వేద్దామ‌ని కూడా అనుకున్నాను. కానీ.. `భ‌య్యా. సారీ.. నేను నీ ఫ్యాన్‌ని. ఇది అనుకోకుండా జ‌రిగిపోయింది` అని ప్రాధేయ‌ప‌డ‌డంతో కేసు వేసే ఆలోచ‌న నుంచి విర‌మించుకున్నాను” అని చెప్పుకొచ్చాడు.

సోష‌ల్ మీడియాలో మంచి కంటే చెడే ఎక్కువ‌గా వ్యాపిస్తోంద‌ని, ఆరోగ్య‌క‌మైన విష‌యాలేవీ సోష‌ల్ మీడియాలో లేవ‌ని చెబుతున్నాడు సునీల్‌. ”నేనో కారో సైకిలో కొనుక్కున్నాన‌నుకోండి. అది కూడా వార్త‌యిపోతుంది. ఓ వ్య‌క్తి త‌న జీవితంలో ఎదుగుతున్న క్ర‌మంలో ఇలాంటివ‌న్నీ సంభ‌విస్తుంటాయి. దాన్ని వార్త అనుకుంటే ఎలా..? దాని బ‌దులుగా వేరే విష‌యాలు ఆలోచించొచ్చు క‌దా? మీ స్పేస్‌ని ఎందుకు పాడు చేస్తారు?” అని నిల‌దీస్తున్నాడు సునీల్‌. పాయింటే క‌దా..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close