ఈసారి కొట్టేస్తాడేమో గురూ…

క‌మెడియ‌న్‌గా ఉన్న‌ప్పుడు సునీల్ నాలుగు చేతులా సంపాదించాడు. ప్ర‌తీ సినిమాలోనూ సునీల్ ఉండాల్సిందే. ఓ ద‌శ‌లో సునీల్ డిమాండ్ ఏ రేంజుకి చేరిందంటే.. పారితోషికంలో బ్ర‌హ్మానందాన్ని మించిపోయాడు. అలాంటి త‌రుణంలోనే హీరోగా ట‌ర్న్ అయ్యాడు. అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, పూల‌రంగ‌డు.. ఇలా త‌న జ‌ర్నీ కూడా బాగానే మొద‌లైంది. అయితే ఆ త‌ర‌వాతే… స‌రైన హిట్టు ప‌డ‌లేదు. కార‌ణాలేమైనా సునీల్ ప్రాభవం కోల్పోవ‌డం మొద‌లైంది. సునీల్ కామెడీ వ‌దిలేసి త‌ప్పు చేశాడేమో అన్న ఫీలింగ్ అంద‌రిలోనూ మొద‌లైంది. సునీల్ ఇప్పుడు జ‌క్క‌న్న‌గా త‌యార‌వుతున్నాడు. ఈ సినిమా జ‌యాప‌జ‌యాలు సునీల్ కెరీర్‌పై ప్ర‌భావం చూపిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే సునీల్ కూడా ఈ సినిమాపై ప్ర‌త్యేకమైన ఫోక‌స్ పెట్టాడు. కొత్త రైట‌ర్ల‌తో డైలాగులు రాయించుకొన్నాడు. ఈసారి పంచ్‌ల‌కెక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. జ‌క్క‌న్న ఆడియో ఫంక్ష‌న్‌కి చిరంజీవిని అతిథిగా పిలుచుకొచ్చి… సినిమాకి త‌న వంతుగా హైప్ తీసుకొచ్చాడు. ట్రైల‌ర్ చూస్తే.. సునీల్ ఈసారి న‌వ్వించే సినిమానే తీశాడ‌న్న ధీమా క‌లుగుతోంది. ట్రైల‌ర్‌లో డైలాగులు బాగానే పేలాయి. ఇదే డోసు.. సినిమాలోనూ ఉంటే.. సునీల్ త‌ప్ప‌కుండా హిట్టు కొట్టేస్తాడు. సునీల్ లాంటి హీరోకి హిట్టు ప‌డ‌డం. త‌న‌కే కాదు.. ఇండ్ర‌స్ట్రీకీ చాలా అవ‌స‌రం. ఆల్ ద బెస్ట్‌.. సునీల్‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close