రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో డిప్యుటేషన్‌పై ఏపీ సీఐడీలో పనిచేసిన ఆయన, ప్రస్తుతం బీహార్‌లో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తనపై నమోదైన కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆయనకు షాక్ ఇచ్చింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం, సునీల్ నాయక్ ఈ నెల మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలి. విచారణకు పూర్తిగా సహకరించాలని, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోర్టు నిర్దేశించింది. ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారి అయి ఉండి కూడా విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. తాను విధులు నిర్వహిస్తున్న చట్టం పవర్ నే ఆయన తక్కువ చేసి చూస్తున్నారు.
ఏపీ పోలీసులు బీహార్ వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటికీ, సాంకేతిక కారణాలతో స్థానిక కోర్టు ట్రాన్సిట్ వారెంట్‌కు నిరాకరించడంతో ఆయన తప్పించుకున్నారు. ఈ ఐదు రోజుల విచారణలో ఆయన ఇచ్చే సమాచారం, దర్యాప్తు అధికారులకు ఆయన సహకరించే తీరును బట్టి ఆయన బెయిల్ ఆధారపడి ఉంటుందని ్నుకోవచ్చు. ఒకవేళ విచారణకు గైర్హాజరైనా లేదా దర్యాప్తును తప్పుదోవ పట్టించినా, కోర్టు నుంచి ఆయనకు లభించిన ఈ తాత్కాలిక రక్షణ తొలగిపోయే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
