కృష్ణ బ‌ర్త్ డే… మెరుపుల్లేవ్‌!

మే 31.. కృష్ణ పుట్టిన రోజు. ప్ర‌తీ యేడాది ఈరోజు.. ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల సంబ‌రాలు అంబరాల్ని దాటేవి. ఎందుకంటే మ‌హేష్ బాబు లేటెస్ట్ సినిమాకి సంబంధించిన ఏదో ఓ అప్ డేట్.. కృష్ణ పుట్టిన రోజున వ‌చ్చేది. టీజ‌రో, ట్రైల‌రో, క‌నీసం ఫ‌స్ట్ లుక్కో.. ఓ పోస్ట‌రో… వ‌దిలేవాళ్లు. ఈసారీ అలాంటి ట్రీటే… ఆశించారు అభిమానులు. ఓ వైపు `స‌ర్కారు వారి పాట‌` ఉంది. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ సినిమా ఉంది. స‌ర్కారు వారి పాట‌కి సంబంధించిన చిన్న టీజ‌రో, త్రివిక్రమ్ సినిమా టైటిలో ఈరోజు వ‌చ్చేస్తుంద‌నుకున్నారు. కానీ అవేం జ‌ర‌గ‌లేదు. `ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో అప్ డేట్లేమీ ఆశించొద్దు..` అని స్వ‌యంగా మ‌హేష్ బాబునే ట్వీట్ చేసేశాడు. కాబ‌ట్టి… మ‌హేష్ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. నిజానికి.. స‌ర్కారు వారి పాట టీజ‌ర్ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. టీజ‌ర్ కి స‌రిప‌డినంత ఫుటేజీ… టీమ్ ద‌గ్గ‌ర లేదు. కానీ త్రివిక్ర‌మ్ టీమ్ మాత్రం టైటిల్ తో సిద్ధ‌మైంది. ఓ పోస్ట‌ర్ ని కూడా డిజైన్ చేసి పెట్టింద‌ట‌. అయితే.. మ‌హేష్ సూచ‌న‌తో.. త్రివిక్ర‌మ్ ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నాడ‌ని తెలుస్తోంది. క‌రోనా హ‌డావుడి త‌గ్గాక‌… షూటింగులు ఎలాగూ మొద‌ల‌వుతాయి. త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లేముందు.. టైటిల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇక స‌ర్కారు వారి పాట అంటారా? ఆ టీజ‌ర్ రావ‌డానికి ఇంకా చాలా టైమే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close