మహేష్ వెళ్లాడు.. కృష్ణ వ‌స్తున్నాడు

బ్ర‌హ్మోత్స‌వం సంద‌డి త‌గ్గింది. నెగిటీవ్ టాక్ వ‌చ్చిన దృష్ట్యా…. తొలివారం గ‌డ‌వ‌క‌ముందే ఆ ఉత్సాహం స‌ద్దుమ‌ణిగింది. మ‌హేష్ బాబు సినిమా థియేట‌ర్ల నుంచి వెళ్లిపోతున్న త‌రుణంలో ఇప్పుడు కృష్ణ సినిమా వ‌స్తోంది. అవును.. కృష్ణ న‌టించిన చిత్రం శ్రీ‌శ్రీ‌. ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌కుడు. విజ‌య‌నిర్మ‌ల‌, న‌రేష్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయ్యింది. కానీ బ్ర‌హ్మోత్స‌వం విడుద‌లైన త‌ర‌వాత శ్రీ‌శ్రీ‌ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావించింది. ఇప్పుడు శ్రీ‌శ్రీ విడుద‌ల తేదీ కూడా ఫిక్స‌య్యింది. జూన్ 2న శ్రీ‌శ్రీ‌ని విడుద‌ల చేస్తున్నారు.

లేటెస్టుగా మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందించ‌డంతో ఈ సినిమాకి కాస్తో కూస్తో క్రేజ్ ఏర్ప‌డింది. మ‌హేష్ వాయిస్‌తో కూడిన టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. శ్రీ‌శ్రీ‌లో డైలాగులూ ఆలోచింప‌చేసేవిగా ఉన్నాయి. కాబ‌ట్టి ఈసినిమాని చూడాల‌న్న కుతూహ‌లం పెరిగింది మ‌హేష్ బాబు సిటీలో ఉంటే.. శ్రీ‌శ్రీ ప్ర‌చారంలో వాడుకొందామ‌ని ఆ చిత్ర‌బృందం భావించింది. కానీ బాబు లండ‌న్ చెక్కేశాడు. అందుకే మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్ ఉన్న టీజ‌ర్‌ని విడుద‌ల చేసి మ‌హేష్ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకొనే ప‌నిలో ప‌డింది చిత్ర‌బృందం. . క‌నీసం సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ అన్నా.. థియేట‌ర్‌కి వెళ్తే అదే ప‌ది వేలు. మ‌హేష్ సినిమా దారుణంగా నిరాశ ప‌రిచిన వేళ‌.. క‌నీసం కృష్ణ అయినా కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close