అత్యున్నత న్యాయవ్యవస్థలో సంక్షోభం

భారత దేశ చరిత్రలో ప్రప్రథమంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నలుగురు కలసి ఒక మీడియా గోష్టి నిర్వహించి ప్రధాన న్యాయమూర్తి తీరు బాగాలేదని చెప్పేశారు. ప్రస్తుత సుప్రీంకోర్టు కొలీజియంలో అత్యంత సీనియర్‌, తెలుగు వారైన జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇందుకు నాయకత్వం వహించినట్టు కనిపిస్తుంది. గత చాలా మాసాలుగా సుప్రీం కోర్టు నిర్వహణ కేసుల అప్పగింత, ధర్మాసనాల ఏర్పాటు సక్రమంగా లేవని తాము పదే పదే చెబుతున్నా లేఖ రాసినా , ఈ ఉదయం కలిసి మాట్లాడినా చీప్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వైఖరిలో మార్పు రాకపోవడం వల్లనే తాము ఇలాటి అసాధారణ నిర్ణయం తీసుకుని దేశం ముందుకు వచ్చామన్నారు. మౌఖికంగా చెబితే ఏదైనా తేడాలు వస్తాయనే కారణంతో కావచ్చు అన్నీ లేఖలో వున్నాయని ఆ ప్రతులు అందజేశారు. లేఖ రావడం ఆలస్యం కావడంతో మీడియా పదేపదే పలు ప్రశ్నలు వేసినా వారు సూటిగా జవాబివ్వలేదు.దేశానికే మార్గదర్శనం చేసే సీనియర్లుగా ఈ విషయాలు చెప్పడం బాధ్యతగా భావించామని వారు అన్నారు. చలమేశ్వర్‌తో పాటు రంజన్‌ గోయెల్‌, మదన్‌ భాటియా, కురియన్‌ జోసఫ్‌ మీడియా ముందుకు వచ్చారు. వారు అందజేసిన లేఖ ప్రకారం చూస్తే ప్రధానంగా కేసుల అప్పగింత, ధర్మాసనాల ఏర్పాటు విషయంలో సిజె ఏకపక్షంగా వ్యవహరించడం ప్రధాన విమర్శగా వుంది. ప్రధాన న్యాయమూర్తి సమానులలో ప్రథముడే తప్ప మిగిలిన వారికంటే ఎక్కువ గానీ తక్కువ గానీ కాదని వారు పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకవిధానంవెెంటనే ఖరారు చేయాలని ఆర్‌పిలూథర్‌ కేసు విచారణలో 27-10-17న ఉత్తర్వు ఇవ్వడాన్ని వారు తప్పు పట్టారు. ఇప్పటికే తాము సుప్రీం కోర్టు అధికారిక న్యాయవాదులకూ కేంద్రానికి మధ్యన నడుస్తున్న 2016 కేసులో ఈ విషయమై కొన్ని వ్యాఖ్యలు చేశామని వారు గుర్తు చేశారు. న్యాయమూర్తుల కొలీజియం ఈ నియామక విధానంపై ఒక పత్రాన్ని పంపినా కేంద్రం స్పందించడం లేదు గనక వారు ఆమోదించినట్టే భావించాలని ఆ కేసులో చలమేశ్వర్‌ మరొకరు చెప్పి వున్నారు. అలాటప్పుడు దాన్ని మళ్లీ తిరగదోడి మరొకరికి అప్పగించడాన్ని ఆక్షేపించారు. అత్యంత కీలకమైన ఈ కేసును అవసరమైతే మొత్తం సుప్రీం కోర్టు విచారించాలి తప్ప చిన్నచిన్న ధర్మాసనాలు ఎలా చూస్తాయని ప్రశ్నించారు. ఇవేగాక ఇంకా అనేక అంశాలలో సిజె సరిగ్గా వ్యవహరించడం లేదు గనక న్యాయప్రక్రియకు నష్టం కలుగుతున్నదని, తమను పిలిపించి మాట్టాడితే వాస్తవాలు చెప్పగలమని ఆ లేఖలోతెలిపారు. మొత్తంమీద పైకి ఇది న్యాయమూర్తుల వివాదంలా కనిపిస్తున్నా వాస్తవంలో కేంద్రానికి న్యాయవ్యవస్థకు సమరంగానే చూడాల్సివుంటుంది. మోడీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థపైనా ఒత్తిడి పెరుగుతున్నదనే విమర్శలకు ఇది బలం చేకూర్చుతున్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close