ఏపీ స్థానిక ఎన్నికలపై స్టే..!

50 శాతానికి మించి రిజర్వేషన్లు ఖరారు చేస్తే.. ఖచ్చితంగా కోర్టు ఎన్నికలను నిలిపివేస్తుందని తెలిసి కూడా.. 59 శాతానికిపైగా రిజర్వేషన్లు ఖరారు చేసిన.. ఏపీ ప్రభుత్వం అనుకున్న ఫలితాన్ని ఎట్టకేలకు సాధించింది. 59 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఇచ్చిన జీవోను హైకోర్టు పట్టించుకోకుండా.. ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో.. రెడ్డి సంక్షేమ సంఘం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వ జీవోపై స్టే విధించింది. ఫలితంగా ఎన్నికలు వాయిదా పడినట్లయింది. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఎప్పుడో రూలింగ్ ఇచ్చింది. గతంలో.. తెలంగాణ సర్కార్ ఇలా 50శాతానికి మంచి రిజర్వేషన్లు ఖరారు చేయడంతో కోర్టు అంగీకరించలేదు.

తర్వాత 50 శాతం లోపు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలు పూర్తి చేశారు. ఈ అనుభవం కళ్ల ముందు ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా మళ్లీ 59 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్దం చేసుకుంది. ముందుగా..మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనుకుంది. ఇప్పుడు ఎన్నికలు ఆగిపోయినట్లయింది. ఈ జీవోకు సంబంధించిన విచారణను హైకోర్టు నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదే్శించింది. ఇప్పటికే హైకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2010లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని ధర్మాసనం స్పష్టం పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేవని తేల్చింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిణామాల నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ఏపీ సర్కార్ అంత ఆసక్తిగా లేదు. ఈ కారణంగా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినప్పటికీ.. ఎన్నికలు జరగకపోతేనే మంచిదని.. భావించి వివిధ కారణాలతో వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు.. కోర్టు చిక్కుల్లో పడేలా చేశారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close