“శరవణ భవన్” ఓనర్ రియల్ విలన్..! హత్య కేసులో యవజ్జీవం..!

మహర్జాతకురాలైన పడుచు పిల్లనో.. చిన్న పిల్లనో పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందని.. నమ్మే వాళ్లు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఉంటారు. రంగం అనే సినిమాలో ప్రతిపక్షనాయకుడైన కోట శ్రీనివాసరావు అదే ప్రయత్నం చేస్తారు. బుక్కయిపోతారు. రియల్‌గా కూడా అలాంటిదే జరిగింది. కాకపోతే.. ఇది మరీ వయోలెంట్ స్టోరీ. ఏకంగా హత్య కూడా జరిగిపోయింది. ఆయన పొలిటీషియన్ కాదు కానీ… ఆయన వ్యాపార రంగంలో ఓ ఇన్‌స్పైరింగ్ క్యారెక్టర్. ఆయనే శరవణభవన్ హోటల్స్ యజమాని పి. రాజగోపాల్.

2001లో తమిళనాడులో… శాంతకుమార్ అనే యువకుడి హత్య జరిగింది. ఇది సంచలనం సృష్టించింది. ఎందుకంటే.. కొద్ది రోజుల కిందటే.. శాంతకుమార్ జ్యోతి అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా ప్రేమ వివాహం. దాంతో.. అతా పరువు హత్య అనుకున్నారు. కానీ పోలీసులు అందులో వివరాలన్నీ బయటకు తీస్తే.. అది ప్రేమ “జాతక హత్య” అని తేలింది. హత్యకు గురైన.. శాంతకుమార్‌ది.. ఈ కథలో .. హత్యకు గురవడం తప్ప.. మరో పాత్ర లేదు. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతి తన ప్రేమేయం లేకుండానే బాధితురాలిగా మిగిలారు. అసుల నిందితుడు మాత్రం… అటు జ్యోతికి కాని.. ఇటు శాంతకుమార్‌కు కానీ.. ఏ మాత్రం సంబంధం లేని… శరవణభవన్ హోటల్స్ యజమాని రాజగోపాల్.

రాజగోపాల్‌ 1979లో శరవణభవన్‌ హోటల్ ను ప్రారంభించారు. ఆహారపదార్థాల అంశంలో మంచి నాణ్యతను అమలు చేయడంతో వ్యాపారం విస్తరించింది. అనతి కాలంలోనే తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హోటల్స్‌ను నెలకొల్పారు. ఆయితే ఆయనకు జ్యోతిష్యం మీద ఎంతో మక్కువ. అప్పటికే ఇద్దర్ని పెళ్లి చేసుకున్నా.. జ్యోతిష్కుడు మరొకర్ని కూడా పెళ్లి చేసుకుంటే బాగా కలసి వస్తుందని.. చెప్పారు. దాని కోసం కొంత మంది జాతకాల్ని పరిశీలించారు. ఈ క్రమంలో… తన దగ్గర పని చేసే అసిస్టెంట్‌ మేనేజర్‌ కుమార్తె జీవజ్యోతి జాతకం బాగుందని.. ఆమెను పెళ్లి చేసుకోవాలని సూచించాడు. రాజగోపాల్ ఈ మేరకు పెళ్లి ప్రయత్నాలు చేశాడు. కానీ జీవజ్యోతి అప్పటికే ప్రేమించిన శాంతకుమార్ ను పెళ్లి చేసేసుకుంది. దాంతో కిరాయి హంతకులతో రాజగోపాల్ శాంతకుమార్ ను హత్య చేయించారు.

విషయం బయటకు రావడంతో.. కేసు నమోదయింది. 2004లో స్థానిక న్యాయస్థానం అతనితో పాటు హంతకులకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 2009లో మద్రాసు హైకోర్టు సైతం ఆ శిక్షనే ఖరారు చేసింది. దీనిని సవాల్‌చేస్తూ రాజగోపాల్‌ సుప్రీం కోర్టులో పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేయడంతో రాజగోపాల్‌ జులై 7 లోపల లొంగిపోనున్నాడు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన 2001 నుంచి బెయిల్‌పై ఉన్నారు. జీవితం మారుతుందని మూడో పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ పెద్ద మనిషి… మొత్తానికే… జీవితాన్ని తిరగేసుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ వర్చువల్ మహానాడు..!

సాంకేతికత ఉపయోగించుకోవడంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారు. కరోనా కాలంలోనూ ఆయన ఈ సాంకేతిక ఆధారంగానే పనులు చక్క బెడుతున్నారు. జూమ్ యాప్‌ను గరిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. మహానాడును కూడా డిజిటల్ మయం...

ఏడాది యాత్ర 8: సంపద సృష్టించలేక ఆస్తులు అమ్మి పాలన..!

"భూములమ్ముతున్నారు... ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా..?" అని హైకోర్టు మొహం మీదనే ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ డౌట్ హైకోర్టుకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలకూ వస్తోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఉన్న...

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

HOT NEWS

[X] Close
[X] Close