చరణ్ కన్ను ఆమెపై పడ్డదట..!

అప్పటిదాకా చిన్న సినిమాల్లో కథానాయికగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ని సడెన్ గా స్టార్ హీరోయి చేసేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రకుల్ కు ముందు బ్రూస్ లీలో అవకాశం ఇచ్చి ఆమెను స్టార్ హీరోయిన్ ని చేసాడు. ఇక అదే క్రేజ్ తో అమ్మడు వరుసగా ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ సరైనోడు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. అయితే రకుల్ కి ఇచ్చినట్టుగానే ఇప్పుడు చరణ్ సురభికి ఓ అవకాశం ఇస్తున్నాడట.

రఘువరన్ బి.టెక్ సినిమాతో తెలుగు తెర మీద కనిపించి అలరించిన సురభి.. సందీప్ కిషన్ బీరువా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమా అంత కమర్షియల్ సక్సెస్ అవ్వకపోయినా అమ్మడికి అవకాశాలు మాత్రం కొదవ లేకుండా పోయింది. వర్మ, మనోజ్ ల ఎటాక్ సినిమాలో నటించిన సురభి తాజాగా శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది.

మేర్లపాక గాంధి దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ నిర్మించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలో సురభి నటన అందరిని ఆకట్టుకుంటుందట. ట్రైలర్స్ లోనే అమ్మడి నటన చూసి ముచ్చటపడుతున్నారు. అయితే అమ్మడి ట్రైలర్ లుక్స్ చూసి చెర్రి కూడా ఫ్లాట్ అయ్యాడట. అందుకే తన సినిమాలో ఆమెకు అవకాశం కల్పించి స్టార్ హీరోయిన్ ని చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడట చరణ్. ప్రస్తుతం తని ఒరువన్ తెలుగు రీమేక్ చేస్తున్న చరణ్ ఆ సినిమాలో శృతి హాసన్ ని ఫైనల్ చేయడం విశేషం. మరి త్వరలోనే అమ్మడికి చెర్రి నుండి సినిమా ఆఫర్ వచ్చినా రావొచ్చని టాక్. అదే జరిగితే అమ్మడు రకుల్ లానే లక్ తోక తోక్కినట్టే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close