కొత్త నిర్మాతలకు సురేష్ బాబు మాటలే పెద్దబాలశిక్ష

తెలుగు సినిమా నిర్మాతలపైన వచ్చినన్ని సెటైర్స్ ఇంకే క్రాఫ్ట్‌కి సంబంధించినవాళ్ళపైన కూడా వచ్చి ఉండవు. అలాగే సినిమా ఇండస్ట్రీని నిర్మాతలు విమర్శించినంతగా ఇంకెవరూ విమర్శించి ఉండరు. ఆవేశంగా, బోలెడన్ని అదర్ ఇంట్రెస్ట్స్‌తో, కొంతమంది ప్యాషన్‌తో కూడా ఇండస్ట్రీకి రావడం…ఎవడో చెప్పిన మాయమాటలకు ఫ్లాట్ అవడం….ఓ ఫ్లాప్ సినిమా తీయడం…ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని, ఇండస్ట్రీలో ఉన్న జనాలను తిట్టుకుంటూ కూర్చోవడం…ఇది ఎక్కువ మంది కొత్త నిర్మాతల తీరు. వేరే ఏ బిజినెస్ చేద్దామనుకున్నా కూడా, కనీసం ఆరు నెలలైనా ఆ బిజినెస్‌కి సంబంధించిన విషయాల గురించి స్టడీ చే్స్తారు. కానీ సినిమా బిజినెస్ అనేసరికి, మనకు చిన్నప్పటి నుంచీ తెలిసిన ఫీల్డే కదా అనో….లేకపోతే కథ బాగుందా? లేదా? అన్న జడ్జ్‌మెంట్ నాకు బీభత్సంగా ఉంది అన్న నమ్మకంతోనో ఫిల్మ్ నగర్‌లో అడుగుపెట్టిన రెండు నెలల్లోపే సినిమా స్టార్ట్ చేసేస్తారు.

సురేష బాబు గత కొంత కాలంగా సినిమాలు తీయడం లేదు. ఎందుకు? ఆయన దగ్గర డబ్బులున్నాయి, ఇంట్లోనే హీరోలున్నారు, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్‌కి సంబంధించిన టెన్షన్స్ ఏమీ లేవు. అన్నీ సొంతవే. కానీ సినిమా తీయడానికి భయపడుతున్నారు. ఎందుకు? ఆ విషయాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. ’ఎవరు కథను చెప్పినా కూడా నమ్మలేకపోతున్నా. ఇలా ఉంటే హిట్టవ్వదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే లేటవుతోంది. ఆ భయంతోనే చాలా సినిమాలను చివరకు వచ్చాక కూడా ఆపేస్తుంటా. రానా విషయంలో ప్రాక్టికల్‌గా కూడా చూశాను. పూరీ జగన్ కథ బాలేదు కదా అన్నా. మావాడేమో చేసేశాడు. నేను నా రాక్షసి ఫ్లాపు. అలాగే ‘నా ఇష్టం’ కథను నేను ముందే రిజెక్ట్ చేశాను. కానీ రానా చేశాడు. అది ఆడలేదు. క్రిష్ తీసిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా నేను తీయాల్సిందే. కానీ నేను ఎక్కువగా మార్పులు, చేర్పులు చెబుతానేమోనని క్రిష్ వద్దన్నాడు. తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు. సినిమా ఏదో అలా ఆడింది. నేను చెప్పిన మార్పులు చేసి ఉంటే ఇంకా బెటర్‌గా ఆడేదేమో..’ ఇవీ ది గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ రామానాయుడిగారి కొడకు అభిప్రాయాలు.

ఆలోచన ఉన్ననాటి నుంచీ కూడా సినిమాలను చాలా దగ్గరగా చూస్తూ, సినిమా మేకింగ్ పైన పూర్తి అవగాహన ఉన్న సురేష్ బాబే అంతలా ఆలోచిస్తుంటే, ఇక కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ ఎంత తీవ్రంగా ఆలోచించాలి. ఎంత మంది కనీసం ఆలోచిస్తున్నారు? ప్రపంచం అంతటా ఉన్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా మోసం చేేసే వాళ్ళూ ఉన్నారు. మంచి వాళ్ళూ ఉన్నారు. సమర్థులూ ఉన్నారు, నాకంటే సమర్థుడు ఎవడూ లేడు అని చెప్పుకు తిరిగేవాళ్ళూ ఉన్నారు. అలాగే ఏ వ్యాపారం చేసినా కూడా మన కష్టం ఫెయిల్ అయితే డబ్బుల వచ్చే పరిస్థితి ఉండదు అన్నది వాస్తవం. అందుకే భారీ లాభాలు రాకపోయినా పెట్టిన పెట్టుబడి పోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఎక్కడైనా…సినిమా ఇండస్ట్రీలో అయినా రిస్క్ తక్కువే ఉంటుంది. అన్నింటికీ మించి సినీ పరిశ్రమ గురించి తెలుసుకుంటే మోసపోయే అవకాశం ఉండదు. అలా తెలుసుకోకపోతే మనల్ని మోసం చేసే అవకాశం ఇంకొకడికి మనమే ఇచ్చినట్టు. గాల్లో దీపం పెట్టి దేవుడా? అన్న చందం అన్నమాట. ఇప్పుడు సురేష్‌బాబు మాటలు విన్నాక అయినా కొంతమంది నిర్మాతలు అయినా జాగ్రత్తపడతారేమో చూద్దాం. సినిమా బిజినెస్ గురించి తెలుసుకుని వచ్చే కొత్తవాళ్ళను డిస్కరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కోట్ల రూపాయల డబ్బు, గొప్ప పేరు, పదవులతో సహా ఎన్నో సంపాదించుకున్న నిర్మాతలు కూడా మన కళ్ళముందే ఉన్నారు. సినిమా పరిశ్రమలో మంచి, చెడుల వలన కాదు… మన తెలివితేటల స్థాయిని బట్టి మన ఫేట్ డిసైడ్ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close