మేమంతా ఎంతో ప్రేమించి చేసిన సినిమా ‘మేము’

మేమంతా ఎంతో ప్రేమించి చేసిన సినిమా ‘మేము’
`ఆడియో వేడుకలో చిత్ర కథానాయకుడు సూర్య

సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పసంగ 2’. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు సాయిమణికంఠ క్రియేషన్స్‌ అధినేత జూలకంటి మధుసూదన్‌రెడ్డి. సూర్య సరసన అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి బింధుమాదవి ముఖ్యభూమిక పోషించింది. అర్రోల్‌ కొర్రెల్‌ స్వర సారధ్యం వహించిన ‘మేము’ గీతావిష్కరణ సోమవారం సాయంత్రం హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో పులువురు సినీ మరియు రాజకీయ ప్రముఖు సమక్షంలో ఘనంగా జరిగింది. చిన్నపిల్లల మనోభావాలు, వారి మానసిక సంఘర్షణ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలను ఆడియో వేడుకకు విచ్చేసిన చిన్నపిల్లల్లోని కొంత మందిని ఎంపిక చేసి వారి చేత విడుదల చేయించడం విశేషం.

ఆడియోను సూర్య విడుదల చేసారు.

ఈ కార్యక్రమంలో సూర్య, చిత్ర కథానాయకి అమలాపాల్‌, కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకుడు పాండిరాజ్‌, సంగీత దర్శకుడు అర్రోల్‌ కొరెల్, మాచర్ల శాసనసభ్యులు పి.రామకృష్ణారెడ్డి, శివకృష్ణ, కె.వి.వి.సత్యనారాయణ, ప్రసాద్‌ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి, రిటైర్డ్‌ జడ్జ్‌ కాంతయ్య, వీరుపోట్ల, మల్టీడైమన్షన్‌ వాసు, గిరి, సుబ్బయ్య, మల్లి, సాయిరెడ్డి, కె.కె.రాధామోహన్‌, నరేంద్ర రాజు, మహాలక్ష్మి సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ… ‘మా బ్యానర్‌లో జ్యోతిక నటించిన ‘36 వయదినిలే’ చిత్రం తర్వాత నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం పాండిరాజ్‌ చాలా రీసెర్చ్‌ చేశారు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయిన అర్రోల్‌ కొర్రెల్‌ సంగీతంపై ప్యాషన్‌తో ఎంతో శ్రద్దతో సంగీతం నేర్చుకొని సంగీత దర్శకుడయ్యారు. ఈ సినిమాకు మంచి సంగీతాన్నందించారు. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత జూకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ… ‘నేను సూర్యగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఏ పాత్రలోకైకా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగలగడం ఆయన ప్రత్యేకత. సూర్య తమిళంలో నిర్మిస్తూ నటిస్తున్న చిత్రాన్ని తెలుగులో ‘మేము’ పేరుతో నిర్మిస్తూ నిర్మాతగా పరిచయమవుతుండడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ‘మనం, దృశ్యం’ చిత్రాల కోవలో ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది’ అన్నారు.

కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ… ‘‘ సూర్య తండ్రి శివకుమార్‌ నటించిన ‘సింధుభైరవి’తోపాటు సూర్య నటించిన రెండు సినిమాను తెలుగులో అనువాదం చేశాను. ఈ సినిమా నిర్మాత జూలకంటి మధుసూదన్‌ రెడ్డిగారు నన్ను కలిసి తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నానని అనగానే, ‘పసంగ 2’ సినిమాను తెలుగులోకి అనువాదం చేయమని నేను చెప్పి సినిమా హక్కును తనకు వచ్చేలా చేశాను. సినిమా డిఫరెంట్‌గా ఉంది, తప్పకుండా అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుంది’’ అన్నారు.

శశాంక్‌ వెన్నెకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.యల్‌, సాహిత్యం: వెన్నెకంటి, చంద్రబోస్‌, సాహితి, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్‌, సమర్పణ: సూర్య-కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండిరాజ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close