పొలిటిక‌ల్ ఎంట్రీపై సూర్య క్లారిటీ

సినిమా హీరోలు కాస్త ఇమేజ్ వ‌చ్చాకో, సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకునే ముందో – రాజ‌కీయాల వైపు చూడ‌డం ఆన‌వాయితీగా మారింది. త‌మిళ నాట ఈ సంస్కృతి మ‌రింత ఎక్కువ‌. ర‌జ‌నీకాంత్, విజ‌య్…పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి అక్క‌డ ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. మ‌రోవైపు న‌టుడు సూర్య‌కి కూడా రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉంద‌ని, ఆయ‌న కూడా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసే అవ‌కాశం ఉంద‌ని త‌మిళ నాట చెప్పుకుంటూ ఉంటారు. సూర్య కూడా సామాజిక సేవా కార్యక్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆయ‌న ట్ర‌స్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల‌కు చ‌దువు చెప్పిస్తున్నారు. త‌మిళ‌నాట విప‌త్తులు ఎప్పుడు సంభ‌వించినా త‌న వంతు సాయం అందిస్తున్నారు.

ఇప్పుడు త‌మిళ‌నాట రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ సంద‌ర్భంగా ‘రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌స్తారు.. అస‌లు వ‌చ్చే ఉద్దేశ్యం ఉందా?  లేదా?’ అంటూ ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌ను ఎదుర్కోవాల్సివ‌స్తోంది. ఈ విష‌య‌మై సూర్య క్లారిటీ ఇచ్చాడు. ”నాకు రాజ‌కీయాల‌పై ఎలాంటి ఆస‌క్తి లేదు. నేనేం చేసినా  మ‌న‌సుకు న‌చ్చిందే చేస్తాను. నేను చేసే సామాజిక కార్య‌క్ర‌మాలు కేవ‌లం సేవాత‌త్ప‌ర‌త‌తో చేస్తున్న‌వే. వాటికి రాజ‌కీయాలు అంట‌గ‌ట్ట‌కండి” అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close