తెలకపల్లి రవి : ఆర్థిక సవాళ్లు- సర్వేలో సత్యాలు

ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌కు ముందు సమర్పించిన ఆర్థిక సర్వేలో అభివృద్ధి అంకెలను చూపించి అంతా బావుందన్నట్టు ప్రచారం జరుగుతున్నది గాని నిజానికి అందులోనే అనేక సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.:

 • అభివృద్ధి రేటు రెండంకెలు దాటిపోతుందని ఒకప్పుడు చెప్పారు. తర్వాత దాన్ని తగ్గించి 8 శాతం ఖాయమన్నారు. ఇప్పుడు సర్వే జిడిపి పెరుగుదల రేటు 7 నుంచి 7.5 శాతం మాత్రమే వుండవచ్చునని తేల్చింది. అయితే రానున్న కాలంలో 8 నుంచి పది శాతం అభివృద్ది సాధించేందుకు అవసరమైన సామర్థ్యం భారతదేశానికి వుందని సర్వే పునరుద్ఘాటించింది.
 • చైనా మార్కెట్‌ కూడా మాంద్యానికి గురైన పరిస్థితులలో భారత దేశమే ప్రపంచ పెట్టుబడులకు స్వర్గధామంగా వుందని అభివర్ణించింది. అదే సమయంలో చమురు ఉత్పత్తుల ధరల పెరుగుదల గాని, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిడి గాని ఈ రెండూ కలసే పరిస్థితి గాని వస్తే తీవ్ర సమస్య తప్పదు.
 • ఈ వృద్ధి రేటు సాధించడం కూడా మూడు అంశాలపై ఆధారపడి వుంటుంది. మొదటిది- అంతర్జాతీయ వాతావరణం బాగాలేనందువల్ల ఎగుమతుల తగ్గుదలను తట్టుకోవడం. ఇదే చక్రవ్యూహ రెండు- వినియోగదారుల(ప్రజల) చేతుల్లో మరింత సొమ్ము చేరేలా విద్యవైద్య రంగాలపై పెట్టుబడులు పెంచడం మూడు- వ్యవసాయ గ్రామీణ రంగాలపై పెట్టుబడుల పెంపు.
 • రోగ నిర్ధారణ బాగానే వుంది గాని చికిత్స మాత్రం వ్యతిరేక దిశలో వుంది. ప్రభుత్వ పరపతి మార్కెటింగ్‌ ఇన్‌పుట్స్‌ లేక రైతాంగం చితికిపోతున్నారన్నది అనుభవంలో తేలుతున్న సత్యం. అయితే ఇప్పుడు మరింతగా ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరవాలని సర్వే సిఫార్సు చేస్తున్నది. అంతేగాక రైతుకు కాస్తో కూస్తో రక్షణ కల్పిస్తున్న ప్రస్తుత వ్యవస్థలను కూడా తొలగించి దేశమంతటినీ ఒకే మార్కెట్‌గా చేసే నూతన ప్రతిపాదనలు చేసింది.
 • బ్యాంకుల దగ్గర కార్పొరేట్లు ఎగవేసిన బాకీలను వసూలు చేయవలసింది పోయి ఇద్దరినీ బతికించడం కోసం లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు వెచ్చించాలని అంచనా వేసింది. ఇది ఒక ఉద్దీపన పథకం కావచ్చు.
 • మామూలుగానే దేశంలోకి ఎఫ్‌డిఐల కన్నా మించి ఎఫ్‌ఐఐ పెట్టుబడులు అధికంగా వస్తున్నాయనేది తెలిసిన విషయమే. మోడీ హయాంలో ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. 2014లో 2,56,213 కోట్ల ఎఫ్‌ఐఐలు వస్తే 2015లో ఇది 63,663 కోట్లకు తగ్గింది. మరోవైపున 2.4బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు దేశం నుంచి తరలిపోయాయి.
 • ఎఫ్‌డిఐల పెరుగుదల 31 శాతం వుంది. అందులోనూ అధిక భాగం రక్షణ రంగంలో ద్వారాలు తెరవడం వల్ల విదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. గడచిన మూడేళ్లలో మొత్తం 47 రక్షణ రంగ ప్రతిపాదనలు అనుమతిస్తే ఒక్క ఈ ఏడాదిలోనే 56 ప్రతిపాదనలకు ఆహ్వానం పలికారు. ఈ వచ్చే వాటిలో చైనా జపాన్‌ దక్షిణ కొరియా వంటి దేశాలున్నాయి.
 • ఉద్యోగ రంగంలో నాణ్యమైన ఉద్యోగాలు రావడం లేదని సర్వే గుర్తించింది. సంఘటిత రంగంలో కన్నా అస్థిర రంగాలలోనే అధికంగా ఉద్యోగాలు లభించాయి. 35 శాతం మాత్రమే సంఘటిత రంగంలో వున్నాయి. భారత దేశంలో యువజనాభా పెరిగిపోతున్న రీత్యా ఉద్యోగావకాశాలు పెంచాల్సి వుంది. ఇండియాలో 2020 నాటికి సగటు వయస్సు 29 ఏళ్లు వుంటుందనీ, అదే చైనా అమెరికాలలో సగటు వయస్సు 37 వుంటుందని అంచనా.
 • పట్టణీకరణక, గృహాల కొరత, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై ఈ సర్వే చాలా ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. అవి మరోసారి…
  • Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com