‘విరాగాలు’ : దాగి ఉండు వెధవాయిత్వం

అగ్గిపుల్లా సబ్బుబిళ్లా కవితకు వస్తువులే అన్నావ్ శ్రీశ్రీ
కడకు నీ కుక్కపిల్ల కూడా కుంటిసాకు అవుతోందోయ్
బుర్రలో లిక్కరు- బుద్ధి నాస్తి.. రోడ్డుపై ఆడపిల్ల- కామం జాస్తి…
పేరు సుశీలు- తీరు మస్తీ… చితకతన్నిజనం- చేసినారు శాస్తి..

అవినీతి అక్రమాలూ పెచ్చరిల్లు పెను ధోరణి అయినా
ఆకతాయి పోకిరి వేషాల్ హద్దు దాటిన ఖర్మం అయినా
నేతల అధికారం మాటున దాగి ఉండు వెధవాయిత్వం
విపక్షాలే కుట్రే అనడం… వారు సదా వాడే కవచం

ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ హైదరాబాదులో మహిళను వేధిస్తూ ఇప్పుడు నిర్భయ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. మహిళను వేధించి.. ఆమె భర్త కాలనీ వాసుల చేతిలో దెబ్బలు తిన్న సుశీల్ తర్వాత పారిపోయి.. కేసు నమోదు కావడంతో.. అంతా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అంటూ బుకాయించడానికి ప్రయత్నించారు. కానీ కేసు పెట్టిన మహిళ.. తనను వేధించిన వ్యక్తి ఎవరో కూడా తెలియకుండానే కేసు పెట్టడం విశేషం. చేతికి టాటూ ఉందనే సంగతి తప్ప.. మరో ఆధారం ఆమె చెప్పలేదు.

తాను కుక్కపిల్లను తప్పించడానికి ప్రయత్నించానని, కారు దిగి కుక్కపిల్లను ఎత్తుకోబోతే.. ఆ మహిళ అపార్థంచేసుకుని, అనవసరంగా భయపడి యాగీ చేసిందని సుశీల్ తన సామాజిక మాధ్యమం ఖాతాల్లో బుకాయించడానికి ప్రయత్నించడం చెల్లలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]0.com