ఐపీఎస్ అదికారిగా చేయకూడని పనులు చేసి సస్పెన్షన్ లో ఉన్న పీవీ సునీల్ కుమార్ అఖిలభారత సర్వీస్ రూల్స్ ను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మీద వ్యాఖ్యలు చేశారు.
దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేశారని.. మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజుని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాల అక్రమ మళ్లింపు కేసులో రఘురామపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయనపై సీబీఐ విచారణ జరుగుతుంది కాబట్టి CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలన్నారు. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలని ఆయన చెప్పుకొచ్చారు.
సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసింది ఆయనపై జరుగుతున్న దర్యాప్తులను సక్రమంగా జరగడానికి కాదు. ఆయన సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి .. తప్పుడు సమాచారం ఇచ్చి విదేశాలకు వెళ్లాడరని. ఆయనపై అసుల కేసుల విచారణ ఇంకా పూర్తి దశకు రాలేదు. కానీ రఘురామను కొట్టిన కేసులోనే ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయననే టార్గెట్ చేస్తున్నారు .
అఖిలభారత సర్వీస్ అధికారులు రాజకీయాలు చేయడం తీవ్ర తప్పిదం. కానీ సునీల్ కు అవేమీ పట్టడం లేదు. పూర్తి స్థాయిలో ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం పదవులు పంచుకుందామని వేరే కులానికి పిలుపునిచ్చారు. ఓ మత సంస్థనూ నడుపుతున్నారు. కానీ ఆయనపై ఇంకా చర్యలు తీసుకోలేదు. అంతగా పోరాటం చేయాలనుకుంటే సర్వీస్ వదులుకుని రాజకీయాల్లోకి వెళ్లాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.
