తగ్గు స్వామీ తగ్గు – ప్రధాని మోదీ!

సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని నరేంద్రమోదీ స్పందించారు. ఆయ‌న వ్యాఖ్య‌లు అనుచిత‌మైన‌వ‌ని అన్నారు. ఆర్ బి ఐ గ‌వ‌ర్న‌ర్ రఘురామ్ రాజ‌న్ దేశ‌భ‌క్తిని శంకించాల్సిన అవ‌స‌రం లేద‌ని మోడీ చెప్పారు. వివాదాలపై వ్యాఖ్యానించడం మోదీ స్వభావానికే విరుద్ధం!

నిబద్ధత, అంకిత స్వభావం వున్న ప్రోఫెషనల్స్ ని సంకుచితమైన రాజకీయ దృక్ఫధంనుంచి చూడకూడదు. ఆర్ బి ఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ను చిన్నబుచ్చి అవమానించి దూరం చేసుకుంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశమే నష్టపోతుందని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సాంకేతిక సలహాదారు శామ్ పిట్రోడా బహిరంగంగా వ్యాఖ్యానించాకే ప్రధాని దిద్దుబాటు చర్యకు పూనుకున్నారు.

అమెరికాలో మంచి లైఫ్ స్టయిల్ ను, సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని, అధిక వేతనాన్ని వదిలి ఇండియాను అభివృద్ధి చేసుకునేందుకు అపుడు తాను, ఇపుడు రాజన్ వచ్చామని పిట్రోడా అన్నారు. ఇండియాకు వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టే క్రమంలో రఘురాం రాజన్, తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారని, చివరికి ఇక్కడ వేధింపులకు గురయ్యారని అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపున్న ఆర్థిక నిపుణుడిపై నోటి కొచ్చినట్టు మాట్లాడారని, ఆయనే స్వయంగా ఆర్బీఐని వీడుతున్నట్టు ప్రకటించడాన్ని విని తానేమీ ఆశ్చర్య పోలేదని అన్నారు. రాజన్ నిబద్ధత, జాతీయత, విశ్వసనీయతపై ఎన్నో విమర్శలు చేశారని, ఇవన్నీ ఆయన మనసుకు కష్టం కలిగించి వుండవచ్చని అన్నారు.

భారత ప్రజలు పనితీరు, ఉత్పాదకతలపై కాకుండా, తమకందే ప్రోత్సాహకాలు, పథకాలపైనే దృష్టిసారించి వున్నారని, ఈ పరిస్థితి మారాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న నేతల పట్ల బయటకు గౌరవమిచ్చే వారు లోలోపల ద్వేషిస్తుంటారని, ప్రజలకు మేలు కలిగిస్తే, ప్రేమను, లేకుంటే కోపాన్ని చవిచూడాల్సి వుంటుందని తెలిపారు. అధికారాన్ని కోల్పోయిన తరువాత తీవ్ర వ్యతిరేకతను అనుభవించాల్సి వుంటుందని అన్నారు.

రాజీవ్ గాంధీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తనకు ఎన్నో బెదిరింపులు ఎదురయ్యాయని, తన భార్యను అత్యాచారం చేస్తామని, పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని, అప్పట్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోని టెలికం మంత్రి ఏకంగా మీడియా సమావేశం పెట్టి తనను తిట్టిపోశారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రాజన్ అదే పరిస్థితిని ఎదుర్కొన్నారని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేశారని అన్నారు.

దేశంలో పేదరికం, ఆకలి, దళితుల సమస్యలు, పారిశుద్ధ్యం, నిరుద్యోగం, పర్యావరణం, భద్రత, ఇంధన వనరుల కొరత వంటి ఎన్నో సమస్యలున్నా, వాటిని పాలకులు పక్కన బెట్టారని అన్నారు. రఘురాం రాజన్ తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించినా, వేధింపులను ఎదుర్కొన్నారని అన్నారు.

దేశంలో విదేశాల్లో వుంటున్న మేధావులు, వృత్తినిపుణుల మనోభావాలకు అద్దంపడుతున్న శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యల లోతుని ప్రధాని మోదీ గుర్తించారు. రాజన్ కు విదేశీ ఆలోచనలేతప్ప దేశభక్తి లేదని ఆయన్ని రిజర్వు బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పించాలన్న బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యను మోదీ ఖండించారు.

ఏ వ్య‌క్తి అయినా తాను వ్య‌వ‌స్థ కంటే ఎక్కువ అని భావించ‌డం త‌ప్పేన‌ని ఒక విలేకరి ఇంటర్వూలో స్వామిని ఉద్దేశించి ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం ఇలాంటి కామెంట్స్ చేయ‌డం దేశానికి ఏమాత్రం మంచిది కాద‌ని మోడీ స్ప‌ష్టంచేశారు. మా పార్టీ ఎంపీయా కాదా అన్న‌ది కాదు ముఖ్యం.. ఎవ‌రైనా స‌రే బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి, ఇలాంటి కామెంట్స్ స‌రికాదు అని మోడీ అన్నారు. రాజ‌న్‌పై ఆయ‌న ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న గొప్ప దేశ‌భ‌క్తుడ‌ని, రాజ‌న్ ప‌ద‌విలో ఉన్నాలేక‌పోయినా ఆయ‌న సేవ‌లు దేశానికి అవ‌స‌ర‌మ‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close