ఎస్వీబీసీ డైరక్టర్లుగా స్వప్న, శ్రీనివాసరెడ్డి..!

శ్రీవారి భక్తి చానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా సినీ నటుడు బాలిరెడ్డి ఫృధ్వీరాజ్‌ను కొన్నాళ్ల క్రితం నియమించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్తగా… మరో సినీ దర్శకుడు శ్రీనివాసరెడ్డి, న్యూస్ చానల్ యాంకర్ స్వప్నలను డైరక్టర్లుగా నియిమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సహజంగా.. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్న ఇద్దర్ని… డైరక్టర్లుగా నియమిస్తూ ఉంటారు. కానీ ఈ సారి బోర్డులో సభ్యులను కాకుండా.. బయట వాళ్లను డైరక్టర్లుగా నియమించడం టీటీడీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఓ డైరక్టర్ స్వప్న న్యూస్ చానల్ యాంకర్. జగన్ వీరాభిమానిగా వీడియోలు పోస్టు చేసి… పలు చానళ్లలో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు. ప్రస్తుతం స్వప్న.. మైహోం రామేశ్వరరావు సొంతం చేసుకున్న 10టీవీలో కీలక పొజిషన్‌లో ఉన్నారు. తన యూటూబ్ చానల్ ద్వారా.. జగన్ ను కీర్తిస్తూ ఉంటారు. ఎన్నికలకు ముందు సాక్షి టీవీ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించారు. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్‌తో ఉన్న స్నేహాన్ని.. సాక్షి టీవీ ప్రోగ్రామ్స్ కోసం ఉపయోగించుకున్నారు. ఇంటర్యూలు చేయించి.. పవన్ ఇమేజీని వీలైనంతగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని భావిస్తున్నారు.

మరో వైపు సినీ దర్శకుడు శ్రీనివాసరెడ్డికి డైరక్టర్‌గా ఎలా అవకాశం ఇచ్చారనేది మిస్టరీగా మారింది. ఆయన సామాజికవర్గ కోణంలోనే పెద్ద పీట వేసినట్లుగా భావిస్తున్నారు. భక్తి కార్యక్రమాల్లో పాల్గొనే దర్శకుడు కూడా కాదు. అయినప్పటికీ.. కేవలం సామాజికవర్గం కారణంగా పిలిచి పెద్ద పీట వేసినట్లుగా భావిస్తున్నారు. ఎస్వీబీసీ నిర్వహణ వ్యవహారాల్లో… ఫృధ్వీ పని తీరు కొద్ది రోజులకే తీవ్ర విమర్శల పాలయింది. ఆ పదవిని అడ్డు పెట్టుకుని… టాలీవుడ్ మొత్తం.. ఎస్వీబీసీకి ఉచితంగా పని చేయాలన్నట్లుగా .. బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగినట్లుగా ప్రచారం జరిగింది. చేయలేమని చెప్పిన వారిపై విమర్శలు చేశారు. అలాగే.. వేషాలు వేసి.. శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి అంటే.. రాజకీయ పోస్టు. దాన్ని అలాగే చూడాలి కానీ.. ఫృధ్వీ ఏదో చేయాలనుకున్నారు.

శ్రీవారికి సంబంధించిన విషయాలు మాత్రమే ప్రసారం చేసే ఎస్వీబీసీలో రాజకీయ పదవులు.. వ్యక్తిగత ఇష్టాలతో… ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించడం ద్వారా… తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి. గత ప్రభుత్వం.. ఎస్వీబీసీ చైర్మన్ గా రాఘవేంద్రరావును నియమించింది. ఆయన.. పని చేసే స్వేచ్చను అక్కడి ఉద్యోగులకు ఇచ్చారు. సూచనలు, సలహాలు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఫృధ్వీ మాత్రం.. అన్నీ తనవే అనుకుంటున్నారు. ఇప్పుడు.. స్వప్న, శ్రీనివాసరెడ్డి క్రియేటివ్ ఫీల్డ్ నుంచే డైరక్టర్లుగా అడుగు పెడుతూండటంతో కోల్డ్ వార్ ప్రారంభమై.. మరింత రచ్చ జరగడం ఖాయమంటున్నారు. అదే జరిగితే… మరిన్ని వివాదాలు.. ప్రభుత్వాన్ని చుట్టుముట్టే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close