‘అల్లూరి’ టైపులో… ‘సైరా’ క్లైమాక్స్‌

అల్లూరి సీతారామ‌రాజు సినిమా గుర్తింది క‌దా? అందులో అల్లూరి సీతారామ‌రాజు బ్రిటీష్ వారి బుల్లెట్ల వ‌ర్షంలో తుడ‌స్తూ… భారీ డైలాగ్ చెబుతాడు. అల్లూరి సీతారామ‌రాజు అన‌గానే గుర్తొచ్చే డైలాగే అది. ఆ డైలాగ్‌కి ప్ర‌తి భారతీయుడి రోమాలూ నిక్క‌బొడుస్తాయి. అల్లూరిలోని దేశ‌భ‌క్తి ని దివిటీలా నిలిచిన సీన్ అది. అచ్చం అలాంటి స‌న్నివేశ‌మే `సైరా`లో కూడా చూడ‌బోతున్నాం. బ్రిటీష్ వారిపై పోరాడిన తొలి త‌రం యోధుడు సైరా. కొన్నేళ్ల పాటు బ్రిటీష్ వారిని గ‌డ‌గ‌డ‌లాడించాడు. చివ‌రికి బ్రిటీష్ ప్ర‌భుత్వం సైరాకి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష స‌మ‌యంలో.. బ్రిటీష్ వారిని ఉద్దేశించి సైరాతో కొన్ని డైలాగులు చెప్పించారు. ఆ డైలాగుల‌కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. దాదాపు 2 పేజీల నిడివి ఉన్న డైలాగ్‌ని చిరంజీవి అన‌ర్గ‌ళంగా ప‌లికాడ‌ట‌. బుర్రా సాయిమాధ‌వ్ క‌లం నుంచి జాలువారిన సంభాష‌ణ‌లు బుల్లెట్ల కంటే వేగంగా దూసుకుపోతాయ‌ని, మొత్తం సినిమాకే క్లైమాక్స్ హైలెట్‌గా నిల‌వ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. మ‌ర‌ణం ముందు కూడా.. త‌న ధీర‌త్వం విడిచిపెట్ట‌ని సైరా చెప్పే ఆ డైలాగులు వినాలంటే.. ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close