‘సైరా’… నుంచి ఆయ‌న త‌ప్పుకొన్నారు!

‘సైరా’ ఆల‌స్యం.. ఆ చిత్ర బృందానికి స‌రికొత్త స‌మ‌సల్ని తెచ్చిపెడుతోంది. ‘సైరా’లో ప‌నిచేసే సాంకేతిక నిపుణులు ఇప్పుడు డేట్లు స‌ర్దుబాటు కాక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రిగితే సెప్టెంబ‌రులోనే ఈ సినిమా మొద‌ల‌వ్వాల్సింది. కానీ.. ఆల‌స్య‌మైంది. దాంతో టెక్నీషియ‌న్లు కంగారు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మ‌రో సినిమా ఒప్పుకొన్న‌వాళ్లంతా మెల్ల‌గా జారుకొనే ప‌నిలో ఉన్నారు. అందులో భాగంగా సైరాలో తొలి వికెట్ ప‌డిపోయింది. కెమెరామెన్ ర‌వి వ‌ర్మ‌న్ ఈ సినిమా నుంచి త‌ప్పుకొన్నారు. క‌మ‌ల్ – శంక‌ర్‌ల ‘భార‌తీయుడు 2’ టీమ్‌లో ఆయ‌న ఉన్నారు. ఈ సినిమా కోసమే ‘సైరా’ వ‌దులుకోవాల్సి వ‌స్తోంది. ఆయ‌న స్థానంలో ర‌త్న‌వేలుని తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ‘రంగ స్థలం’ సినిమాతో బిజీగా ఉన్నాడు ర‌త్న‌వేలు. ‘రంగ‌స్థలం’ పూర్త‌యిన త‌ర‌వాతే ‘సైరా’ని మొద‌లెట్టాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. అందుకే… ర‌త్న‌వేలుని ఎంచుకొంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. ‘ఖైది నెం. 150’కీ ర‌త్న‌వేలు ప‌నిచేశారు. కాబ‌ట్టి.. వేవ్‌లెంగ్త్స్ బాగా క‌లిశాయి. ‘సైరా’ మ‌రింత ఆల‌స్య‌మైతే మాత్రం మ‌రికొన్ని వికెట్లు ప‌డే ప్ర‌మాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close