‘సైరా’కి బిగ్ బ్రేక్‌

గుట్టు చ‌ప్పుడు కాకుండా ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ తొలి షెడ్యూల్ పూర్త‌యిపోయింది. దాదాపు ప‌ది రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో నాన్ స్టాప్‌గా షూటింగ్ జ‌రిగింది. అయితే.. ఇప్పుడు ‘సైరా’కి భారీ విరామం ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. రెండో షెడ్యూల్ జన‌వ‌రి నుంచి ఫిబ్ర‌వ‌రికి వెళ్లిపోయిన‌ట్టు స‌మాచారం. కొత్త షెడ్యూల్ ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇంత పెద్ద బ్రేక్ తీసుకోవ‌డానికి కార‌ణం ఒక్క‌టే.. సెట్ల త‌యారీ. ఈ సినిమాలో సీజీ వ‌ర్క్‌కి చాలా ప్రాధాన్యం ఉంది. దానికి త‌గిన‌ట్టే సెట్స్ డిజైన్ చేయాల్సివ‌స్తోంది. దానికి తోడు… స్టార్ హ‌డావుడి ఈ సినిమాలో చాలా ఉంది. న‌య‌న‌తార‌, అమితాబ్‌, సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు.. ఇలా హేమా హేమీలున్నారు. వాళ్ల డేట్ల‌న్నీ స‌ర్దుబాటు అయ్యేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. పైగా 2019 సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమా ఇది. అందుకే మేకింగ్ విష‌యంలో హ‌డావుడి ప‌డ‌డం లేదు.

ఈ చిత్రం నుంచి న‌య‌న‌తార‌ని త‌ప్పించార‌న్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ఆలోచ‌న ఉన్న మాట వాస్త‌వ‌మే గానీ, ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. న‌య‌న‌ను ప‌క్క‌న పెడితే.. మ‌రో మంచి ఆప్ష‌న్ కూడా దొర‌క‌డం క‌ష్టంగా మారింది. న‌య‌న స్టేట‌స్‌కి స‌రి స‌మాన‌మైన అనుష్క ఉన్నా. ఇందులో మ‌రో క‌థానాయిక‌గా ఆమెకు ఓ స్థానం ఉంది. సో.. న‌య‌న‌ను త‌ప్పించ‌క‌పోవొచ్చ‌ని తెలుస్తోంది. మ‌రీ.. న‌య‌న కాల్షీట్లు ఇబ్బందిగా ప‌రిణ‌మిస్తే.. న‌య‌న కి అనుకున్న పాత్ర‌ని అనుష్క‌కి అప్ప‌గించి, అనుష్క పాత్ర‌లో మ‌రో క‌థానాయిక‌ని తీసుకొనే ఉద్దేశాలు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com