టీ కాంగ్రెస్‌లో నిస్తేజం పీసీసీ మార్పుతో అయినా పోతుందా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నేతా సీరియస్‌గా వ్యవహరించడం లేదు. ఓటమికి సమీక్ష జరిపి … హైకమాండ్‌కు పంపాల్సిన నివేదిక కోసం..నిర్వహిస్తున్న సమావేశాలకు.. ఎవరూ రావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీలో కీలక పదవులు నిర్వహించిన నేతలు సమీక్ష సమావేశాలకు హాజరుకావడం లేదు. రెండు రోజులపాటు గాంధీ భవన్ లో జరిగిన పార్లమెంటు సమీక్ష సమేశాలల్లో 12 పార్లమెంటు నియోజకవర్గ ల సమీక్ష జరిగింది. ఒక్కటంటే.. ఒక్క నియోజకవర్గానికి చెందిన కీలక నేత కూడా వచ్చి… తమ ఓటమికి కారణాలు ఇవని చెప్పలేదు. మొదటిరోజు సమీక్షలకు హాజరుకావాల్సిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రాలేదు. రేవంత్ రెడ్డి ,అజారుద్దీన్ సమీక్షలకు రాకుండా దూరంగా ఉన్నారు. అంతే కాదు.. గెలిచిన ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు, గండ్ర వెంకరమణ రెడ్డి సమాచారం ఉన్నా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. మాజీ మంత్రులు సైతం అంటి ముంటనట్లుగా వ్యవహరిస్తున్నారు.

మంచి ఫలితాలు సాధించిన ఖమ్మం జిల్లాకు చెందిన సమీక్షా సమావేశంలోనూ రగడ జరిగింది. రేణుకా చౌదరి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని.. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ దారిలో తాము పయనించారు. వాళ్ల టార్గెట్ నల్లగొండ పార్లమెంట్ టిక్కెట్ సాధిచుకోవడమే. మహబూబ్ నగర్ జిల్లా నుంచి హేమహేమీలైన నేతలు ఉన్నా… ఎవరూ సమీక్షలకు రావడం లేదు. సంపత్, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, వంశీకృష్ణ, జైపాల్ రెడ్డి సమావేశాలకు హాజరు కాలేదు.పార్లమెంట్ ఇంచార్జ్ లు సురేష్ షెట్కార్ , మధుయాష్కీ గౌడ్ సమీక్షలకు డుమ్మా కొట్టారు. జగ్గారెడ్డి, గీతా రెడ్డి,అరెపల్లి మోహన్,కొండ సురేఖ,గండ్ర వెంకటరమణ రెడ్డి,దొంతి మాధవ రెడ్డి,ప్రతాప్ రెడ్డి లు సమీక్షలకు దూరంగా ఉన్నారు.

అయితే ఎన్నికల ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి, ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా కుంతియా,ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి మెజార్టీ పార్టీ నేతల్లో ఉంది. అందుకే ఆ నేతల పైన ఉన్న అసంతృప్తి తోనే సమీక్ష సమావేశాలకు మెజార్టీ నాయకులు హాజరవడం లేదని.. ఆయా ముఖ్య నేతలు చెబుతున్నారు. పీసీసీని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదనే అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close