టీ కాంగ్రెస్ కొత్త అస్త్రం బీసీలకు 50 శాతం సీట్లు..!

మున్సిపల్ ఎన్నికల్లో.. బీసీల రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించాయి. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెద్దగా ఇష్యూ కాలేకపోయాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం.. దీన్ని ఓ అస్త్రంగా మల్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. మాటల్లో కాకుండా.. చేతల్లో రిజర్వేషన్లు లేకపోయినప్పటికి… యాభై శాతం సీట్లు… బలహీనవర్గాలకు ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపుగా నిర్ణయించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రేజర్వేషన్ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఇప్పటికే వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయం లో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ మున్సిపాలిటీ లో ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పార్టీ తరపున బీసీ లకు ముస్లిం లకు 50 శాతం టికెట్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిది.

అయితే ప్రస్తుతం.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా.. అయోమయంలో ఉంది. క్యాడర్‌ను మళ్లీ యాక్టివ్ చేసేందుకు ఇంటింటికి కాంగ్రెస్ ,వాడవాడలా జెండా కార్యక్రమాన్ని ప్రకటించారు. మున్సిపాలిటీ లలో పార్టీ కార్యక్రమలు విస్తృతంగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. టిక్కెట్లపై ఆశలు ఉన్న వాళ్లు… ఈ కార్యక్రమాన్ని బాగానే చేపడుతున్నారు. ఈనెల 20న రాజీవ్ గాంధీ 75 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి.. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగించాలని నిర్ణయించారు. ఎప్పుడు ఎన్నికలోచినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అందులోభాగంగా మున్సిపల్ ఎన్నికల కు క్యాడర్ ని సంసిద్ధం చేయాలని పీసీసీ నిర్ణయించింది. జనంలోకి వెళ్లేందుకు క్యాడర్ కి అజెండాను కూడా ప్రిపేర్ చేసి ఇచ్చింది.

అయితే.. కార్యకర్తలకు… నేతలు .. ఆదేశాలు జారీ చేయడమే కానీ.. సీనియర్ నేతలెవరూ.. కార్యక్షేత్రంలో కనిపించకపోవడం… చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సమయం గడుపుతున్నారు… వారి వారి నియోజకవర్గాలకు మాత్రమే.. రాష్ట్ర స్థాయి నేతలు పరిమితమవుతున్నారు. మరి .. ఇతర జిల్లాలు.. మున్సిపాల్టీల గురించి ఎవరు.. బాధ్యత తీసుకుంటారన్న దానిపై … గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. కానీ అందరూ తమకేమీ సంబంధం లేనట్లే ఉంటున్నారు. అందుకే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల కార్యాచరణ అంతా.. ఏసీ రూముల్లో సమావేశాలకే సరిపోతోందన్న విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close