టీ కాంగ్రెస్ ఆత్మవంచన..! దిద్దుబాట్లు ఏవి..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ… రోజు రోజుకు చిక్కిపోతోంది. ప్రజాప్రతినిధులే కాదు.. ద్వితీయ శ్రేణి నేతలు కూడా వలస బాట పడుతున్నారు. పట్టించుకోవాల్సిన పెద్దలు పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. వాళ్లు వెళ్లిపోవడం వల్ల నష్టం లేదని.. గంభీర ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. పరిస్థితిని చక్కదిద్దడానికి కిరీటాలు పెట్టుకున్నవాళ్లు ఒక్కరూ ప్రయత్నించడం లేదు. ఎవరైనా ప్రయత్నిస్తే.. వారిపై పుకార్లు రేపుతున్నారు. దాంతో.. అందరూ మనకెందుకు వచ్చిందిలే అని సైలెంటయిపోతున్నారు.

ఇలాగే ఉంటే.. కాంగ్రెస్‌లో ఎవరైనా మిగులుతారా..?

అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ రెండు పార్టీలు హస్తం నేతలకే వల వేస్తుండటంతో ఎలా నియంత్రించాలో తెలియక తలపట్టుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పదవులు అనుభవించి, అన్ని రకాలుగా లాభ పడిన నాయకులు సైతం పార్టీని వీడుతుండటంతో రాష్ట్ర నాయకత్వం నిస్సహాయ స్థితిలోకి వెళుతోంది. ఇప్పటికే మండల, జిల్లా స్థాయి నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలను పెద్ద సంఖ్యలో కారు పార్టీలో చేర్చుకుని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇక బీజేపీ ఉన్న నాయకులకు గాలం వేస్తుండటంతో కమలం కండువా కప్పుకునేదేవరు పార్టీలో మిగిలే వారెవరనే చర్చ జోరందుకుంది.

పోయేవాళ్ల వల్ల నష్టం ఉండదంటే.. ఉండకుండా పోతుందా..?

ప్రస్తుతం బీజేపీ… కాంగ్రెస్ నేతలను తమ వైపుకు లాగేసుకుని తెలంగాణలో ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేసే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇప్పటికే డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ , విజయరామారావు వంటి చాలా మంది నాయకులకు బీజేపీ కండువా కప్పేసింది. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గాలం వేసింది. ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హైదరాబాద్ శివార్లలోని ఓ హోటల్‌లో మకాం వేసి పూర్తి స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే చాలా మంది కాంగ్రెస్ నేతలు.. రామ్ మాధవ్ పోన్ కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

పార్టీ నేతలకు కాస్త ధైర్యం కల్పించే ప్రయత్నం కూడా చేయరా..?

అసలు నాయకులు పార్టీ ఎందుకు వీడుతున్నారన్న అంశం పై పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లాయి.దాంతో రాజకీయ భవిష్యత్ పై బెంగపెట్టుకున్న నాయకులు పక్కచూపులు మొదలుపెట్టారు. దాంతో పాటుగా ఆర్థిక అవసరాలు, వ్యాపార, కాంట్రాక్ట్ నేపథ్యం ఉన్న నాయకుల స్తబ్దుగా ఉన్న నాయకులు, రాష్ట్ర నాయకత్వం పై గుర్రుగా ఉన్న వారు ఇతర బలహీనతలు న్న నేతలే టార్గెట్ గా ఆపరేషన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి నాయకులే పార్టీ వీడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏదైనా వారిలో ధైర్యం నింపాల్సిన నేతలు మాత్రం నింపాదిగా ఉంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close