జలసంఘం తేల్చిన టీ -నాటకం!

పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ సర్కారు ఇన్నాళ్లూ చెబుతున్న మాటలన్నీ.. ‘అశ్వత్థామ హతః కుంజరః’ తరహా అర్థసత్యాలే! ఈ ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని రాయలసీమ సహా మరికొన్ని జిల్లాలు కనీస సాగునీరు కూడా లేకుండా ఎడారిగా మారుతాయని కొన్నాళ్లుగా ఏపీకి చెందిన దాదాపు అన్ని రాజకీయ పక్షాల వారు ఆందోళనలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు సంకల్పించిన ప్రాజెక్టులే తప్ప కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులు కాదంటూ తెలంగాణ సర్కారు బుకాయిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కేంద్ర జలసంఘం ఇచ్చిన అఫిడవిట్‌లో వారినుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే, కనీసం వారికి సమాచారం కూడా ఇవ్వకుండానే తెలంగాణ సర్కారు ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్లుగా తెలుస్తున్నది.

పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు తొలినుంచి వివాదాస్పదంగానే ఉన్నాయి. కృష్ణాజలాల వినియోగంతో ముడిపడిన ఈ ప్రాజెక్టులు గనుక పూర్తయి తెలంగాణ ఇష్టానుసారంగా వాడుకోవడం మొదలైతే రాయలసీమకు నీళ్లు అందడం దుర్లభం అవుతుంది. అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చురుగ్గా వ్యవహరించడం లేదని, కేసీఆర్‌ సర్కారుకు ఏపీ ప్రయోజనాల్ని చంద్రబాబు తాకట్టు పెట్టేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దానికి తగినట్లుగానే ప్రభుత్వం కూడా నిస్తేజంగా వ్యవహరిస్తూ వచ్చింది.

మధ్యలో ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి నిరాహార దీక్ష చేసినా సర్కారులో స్పందన రాలేదు. తాజాగా జగన్మోహనరెడ్డి కూడా దీక్షకు సంకల్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నాయకులు అందరూ కలిసి.. తమ ప్రాజెక్టులను అడ్డుకుంటూ ఉన్నారని ఏపీ నాయకులను చెడామడా తిట్టడం జరుగుతూ ఉన్నది తప్ప.. వారు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తెచ్చుకోవడం మాత్రం జరగలేదు. తెలంగాణ నాయకులు ఎంతగా గట్టిగా అరుస్తూ ఏపీ నాయకులను తిడితే, అంతగా తమ వాదనలో న్యాయం ఉన్నదని అందరూ అనుకుంటారనే చందంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఏపీ రైతులు సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో వారు అసలు కేంద్ర జలసంఘానికి సమాచారమే ఇవ్వలేదనే వాస్తవం బయటపడింది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందో..? ఈ ప్రాజెక్టులను ఎలా అడ్డుకోవడం జరుగుతుందో వేచిచూడాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close