తెలుగు360 సర్వే : ఓవరాల్‌గా 2014 నాటి ప్రజాభిప్రాయం మారనట్లే..!

తెలుగు 360 జిల్లాల వారీగా… పకడ్బందీగా చేసిన సర్వే ఫలితాలను రోజువారీగా ప్రకటించారు. ఇక … అన్నింటినీ కలిపి.. ఓవరాల్ సర్వే ఫలితాలను ఈ రోజు ప్రకటిస్తున్నారు. మేం జిల్లాల వారీగా సర్వేలు ప్రకటించడం ప్రారంభించి.. చివరి దశకు వచ్చిన తర్వాత వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు, జాతీయ మీడియా చానళ్లు కూడా… తమ తమ సర్వే ఫలితాలు వెల్లడించాయి. దాదాపుగా.. తెలుగు 360కి అన్నీ అటూ ఇటూగా ఉన్నాయి. ఇది.. మా సర్వే మెకానిజంలో… పొరపాటు లేదని… నమ్మకం కలిగించగలిగాయి. చాలా పరిమితమైన వనరులతో… అత్యంత పకడ్బందీగా మేం చేసిన తొలి ప్రయత్నం ఇది.

పదమూడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌లో… మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీ ఈ సారి 108 సీట్లు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై, పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఏడు సీట్లు వస్తాయని.. తెలుగు 360 సర్వేలో స్పష్టం చేసింది. నెల్లూరు, కడప జిల్లాల్లో మాత్రమే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి. మిగిలిన చోట్ల.. టీడీపీనే ఆధిక్యం చూపించనుంది.

ఏ సర్వేకు అయినా.. ఐదు నుంచి పదిశాతం…మార్జిన్ ఉంటుంది. ఐదు నుంచి పదిశాతం ఫలితాలు… అటూ ఇటూ కావొచ్చు. ఎన్నికల ప్రచారం ఊపందుకునే కొద్దీ… రాజకీయం కూడా… కాస్త మార్పువచ్చింది. పదిహేను రోజుల కిందట.. సర్వే ఫలితాలను ఎనాలసిస్ చేయడం ప్రారంభించిన తర్వాత… రాజకీయం మరింతగా.. పొలరైజ్ అయింది. జనసేన అధినేత బలంగా.. తాను ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఈ పరిణామం చూస్తే.. అంతిమ ఫలితాల్లో జనసేన మరింత నష్టపోయే అవకాశం ఉంది. అలాగే… చివరి వారం రోజుల్లో చంద్రబాబు చాలా స్ట్రాటజిక్ గా వ్యవహరించారు. నేరుగా ఓటర్లపై ప్రభావం చూపేలా… పెన్షన్లు, మహిళలకు రూ. నాలుగు వేలు, నాలుగో విడత రుణమాఫీ వంటివి పంపిణీ చేశారు. ఇవన్నీ.. ఓటర్ల మనసుల్ని ఎంతో కొంత ప్రభావం చూపేవి. ఎంత ప్రభావం చూపుతాయనే విషయంపై ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టం. మొత్తం ఫలితాల్లో మాత్రం పెద్దగా మార్పు రాకపోవచ్చనేది.. తెలుగు360 సర్వే బృందం అంచనా.

టీడీపీ వైసీపీ జనసేన
శ్రీకాకుళం640
విజయనగరం630
విశాఖ జిల్లా 1131
తూ.గో జిల్లా1252
ప.గో జిల్లా1122
కృష్ణా జిల్లా952
గుంటూరు జిల్లా1240
ప్రకాశం జిల్లా660
నెల్లూరు జిల్లా370
కడప జిల్లా 460
కర్నూలు జిల్లా860
అనంతపురం జిల్లా1130
చిత్తూరు జిల్లా 860
మొత్తం 108607

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close