తెలుగులో ట‌బు రీ ఎంట్రీ ఖాయ‌మైంది

కూలీ నెం.1తో తెలుగు జ‌నాల్ని అల్లాడించేసింది ట‌బు. నిన్నే పెళ్లాడ‌తాలోనూ అంతే! ఆ త‌ర‌వాత‌ ఈ పొడ‌గుకాళ్ల సుంద‌రికి తెలుగునాట ఫ్యాన్స్ పోగ‌య్యారు. ఇదీ సంగ‌తి, పాండురంగ‌డు త‌ర‌వాత ట‌బు తెలుగులో క‌నిపించ‌లేదు. ఇంత‌కాలానికి మ‌ళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతోంది ట‌బు. అనుష్క ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న భాగ్‌మ‌తిలో ట‌బుకి అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమాలో అనుష్క‌కు త‌ల్లిగా ట‌బు క‌నిపించ‌నున్న‌ద‌ని టాక్‌. త‌ల్లి పాత్ర అని చిన్న చూపు చూడక్క‌ర్లేద‌ని, ఈసినిమాలో ట‌బు రోల్ చాలా కీల‌క‌మ‌ని కూడా చెబుతోంది. అత్తారింటికి దారేదిలో న‌దియా పాత్ర ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందో.. ఈ సినిమాలోనూ ట‌బు పాత్ర అలానే ఉంటుంద‌ట‌. ట‌బుకి కూడా భారీ రేంజులోనే పారితోషికం క‌ట్ట‌బెట్టార‌ని తెలుస్తోంది. ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల హ‌వా బాగా సాగుతోంది.

ర‌మ్య‌కృష్ణ‌, న‌దియాలాంటి వాళ్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. ట‌బుకీ ఆ అవ‌కాశం ఇప్పుడొచ్చింది. భాగ్‌మ‌తి క్లిక్ అయితే.. తెలుగులో ట‌బు బిజీ అయిపోవ‌డం ఖాయం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్ల‌లో భాగ్‌మ‌తి షూటింగ్ జ‌రుగుతోంది. అనుష్క ఇంకా సెట్లో ఎంట‌ర్ అవ్వ‌లేద‌ని టాక్‌. అనుష్క‌, ట‌బు ఒకేసారి భాగ్‌మ‌తిలో జాయిన్ అవుతార‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com