అనుష్క‌తో పాటు ఆమె కూడా…

అనుష్క త్వ‌ర‌లోనే భాగ్‌మ‌తిగా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంది. పిల్ల‌జ‌మిందార్ సినిమాతో మెప్పించిన జి.అశోక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. దాదాపు రూ.40 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. ఈ సినిమాలో ఇప్పుడు ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ చేరింది. అనుష్క‌తో పాటుగా ట‌బు కూడా ఇందులో న‌టించ‌బోతోంద‌ట‌. భాగ్‌మ‌తిలో ఓ కీల‌క‌మైన పాత్ర‌కోసం చిత్ర‌బృందం ట‌బుని సంప్ర‌దించ‌డం, ఆమె ఒప్పుకోవ‌డం జ‌రిగిపోయాయని టాలీవుడ్ స‌మాచారం. చంద్ర‌సిద్దార్థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇదీ సంగ‌తి త‌ర‌వాత ట‌బు తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. పాండురంగ‌డులో అందాలు ఆర‌బోసిన ట‌బు… ఇప్పుడు తెలుగు తెర‌పై మ‌ళ్లీ క‌నిపించ‌బోతోంద‌న్న‌మాట‌.

ఈ సినిమా కోసం ట‌బు భారీ పారితోషికం ఆఫ‌ర్ చేసింద‌ని తెలుస్తోంది. కాల్షీట్లు ఎక్కువ కావ‌ల్సిరావ‌డంతో చిత్ర‌బృందం కూడా ట‌బు అడిగినంత ఇవ్వ‌డానికి రెడీ అయ్యింద‌ట‌. న‌దియాలాంటి వాళ్లు కీల‌క పాత్ర‌లు చేస్తూ.. బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ఇప్పుడు ట‌బు కూడా ఇలాంటి పాత్ర‌లు చేయ‌డంలోని ఆవ‌స్య‌క‌త‌ని గ‌మ‌నించిన‌ట్టుంది. అందుకే భాగ్‌మ‌తి ఒప్పుకొంది. ఈ సినిమాలో ట‌బు రాక‌.. ఆమె కెరీర్‌కీ, సినిమాకీ ఎంత హెల్ప్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని నెల‌లైనా ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close