డిఫెన్స్‌లో టీఆర్ఎస్..! ఇప్పటికీ గత పాలకులపైనే నెపమా..!?

ప్రాజెక్టుల్లో ప్రమాదాలు.. హైదరాబాద్ వరదలు తెలంగాణ రాష్ట్ర సమితిని డిఫెన్స్‌లో పడేస్తున్నాయి. బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నామన్న చెబుతున్న నేతలు.. వీటిని ఎలా సమర్ధించుకోవాలో అర్థం కావడం లేదు. దీంతో వారు అలవాటైన ఎదురుదాడి.. ఒకటే చేస్తున్నారు. అదే ఇదంతా గత పాలకుల పాపమేనని చెబుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎప్పుడూ లేని విధంగా నీట మునిగింది. దీనికి కారణం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల కక్కుర్తేనని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన మంత్రి నిరంజన్ రెడ్డి.. కల్వకుర్తి నీట మునగడానికి కారణం.. గత ప్రభుత్వాలేనని ఆరోపించేశారు. గత ప్రభుత్వాలు ఎలా కారణం అవుతాయో.. ఆయన లెక్క ఆయన చెబుతారు కానీ.. వినేవారికి మాత్రం తేడాగా అనిపిస్తూ ఉంటుంది.

హైదరాబాద్ వరదల విషయంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మరో మాట లేకుండా.. గత పాలకుల పాపమేనని చెప్పేశారు. హైదరాబాద్‌లో వరదలు అత్యంత తీవ్రమైనవి. కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. ప్రభుత్వం క్రియాశీలకంగా స్పందించలేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఈ తప్పును.. గత పాలకులపై నెట్టేయడానికి నేతలు ఏ మాత్రం సిగ్గుపడలేదు. ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెర ముందుకు వచ్చేశారు. నాలాలు, చెరువులపై కట్టడాలు మా ప్రభుత్వంలో కట్టినవి కావని .. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారని ఆరోపించేశారు. నిజానికి తలసాని పార్టీలు మారి అయినా ప్రభుత్వాల్లో కొనసాగుతున్నారు. ఆ ప్రభుత్వాల్లో తలసాని కూడా ఉన్నారు.

గత ప్రభుత్వాల పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి..ఇప్పుడా పరిస్థితి ఉందా? .. అని ఎదురుదాడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా?…ప్రధాని జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని తక్షణ సహాయం కింద నిధులు విడుదల చేయాలని అంటున్నారు. టీఆర్ఎస్ నేతల వాదన రాజకీయ నేతలకు కౌంటర్ ఇవ్వడానికి పనికి వస్తుంది కానీ.. ప్రజలను మాత్రం మెప్పించదు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. ఇలాంటి సమయంలోనూ.. జరిగే ప్రతీ దానికి గత పాలకులు.., సమైక్యాంధ్ర పాలకులు అని కారణాలు చెబుతూ పోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్న నేతలంతా.. ఆ సమైక్య పాలక ప్రభుత్వాల్లో భాగంగానే ఉన్నారు.

కొన్నాళ్ల కిందట వరకూ.. టీఆర్ఎస్ ఇలా వాదనలు వినిపిస్తే.. కాస్త ఎఫెక్టివ్‌గా ఉండేది. కానీ ఎప్పటికప్పుడు… ప్రజలకు కష్టాలొచ్చినప్పుడల్లా.. వారి కష్టాలను తీర్చేప్రయత్నం చేయకుండా… పక్కనోళ్లపై నిందలేసి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకైనా చిరాకేస్తుంది. ఇప్పుడా పరిస్థితి వచ్చింది. ఇంత కన్నా మెరుగైన వ్యూహాన్ని టీఆర్ఎస్ నేతలు.. సిద్ధం చేసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close