ఆయ‌న మొక్కులన్నీ ప్ర‌జ‌ల బాగు కోసమేన‌ట‌..!

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అని వెన‌క‌టికి ఎవ‌ర్నో ప్ర‌శ్నిస్తే… దూడకి గ‌డ్డి కోసుకొద్దామ‌ని స‌మాధాన‌మిచ్చాట్ట‌! అయ్య‌వారు అన్నేసి మొక్కులు ఎందుకు మొక్కార‌య్యా అంటే.. ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అని చెప్తున్నారు తెరాస నేత‌లు! ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొక్కులూ పూజ‌లూ ఆల‌యాల‌కు ఆభ‌ర‌ణాల స‌మ‌ర్పణ‌ల‌పై అన్ని వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. సొంత మొక్కులు తీర్చ‌డం కోసం ప్ర‌జాధ‌నాన్ని వెచ్చించ‌డం ఎంత‌వ‌ర‌కూ క‌రెక్ట్ అంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నారు. ఇదే అంశ‌మై హైకోర్టులో కేసు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మౌతోంది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ స్పందించారు. కేసీఆర్ పూజ‌లూ మొక్కులపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేవాల‌యాల‌కు న‌గ‌లు కానుక‌లుగా ఇస్తే త‌ప్పేముంద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. ఇది ప్ర‌జ‌ల బాగు కోసం చేస్తున్న ప‌నే క‌దా అంటూ స‌మ‌ర్థించుకున్నారు. ప్ర‌జలంద‌రూ బాగుండాల‌ని కోరుకుంటున్నారు కాబ‌ట్టే మొక్కులు తీర్చుకుంటున్నారు అంటూ క‌వ‌రింగ్ ఇచ్చుకున్నారు. ఇందులో ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అనే కాన్సెప్ట్ లేద‌న్న‌ట్టుగానే స‌మ‌ర్థించుకున్న తీరు విడ్డూరంగా అనిపించ‌డం లేదూ..!

కేసీఆర్ పూజ‌లు చేయ‌డం, దేవాల‌యాల‌కు కానుక‌లు ఇవ్వ‌డం అనేది ఆయ‌న వ్యక్తిగ‌త విష‌యం. దాన్ని ఎవ్వ‌రూ విమ‌ర్శించ‌రు. కానీ, వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌జాధ‌నం ఖర్చు చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అనేదే ఇక్క‌డ అస‌లు ప్ర‌శ్న‌. ఈ పాయింట్‌ని చాలా తెలివిగా దాటేస్తున్నారు మంత్రి త‌ల‌సాని! స‌రే, మంత్రిగారు చెబుతున్న‌ట్టూ ఇదీ ప్ర‌జ‌ల బాగు కోసం చేస్తున్న‌దే అయిన‌ప్పుడు… దీన్ని ఓ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంగా మార్చెయ్యండీ. సంక్షేమ ప‌థ‌కాల జాబితాలో దీన్నీ చేర్చేయండి. ముఖ్య‌మంత్రి మొక్కుల కోసం ప్ర‌తీయేటా ఫ‌లానా ఇంత ఖ‌ర్చు చేద్దామ‌నుకుంటున్న‌ట్టు బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేక కేటాయింపులు కూడా ప్ర‌క‌టించెయ్యండీ..! అధికారం వారి చేతుల్లోనే ఉంది క‌దా!

మ‌న‌ది లౌకికరాజ్యం అని చిన్న‌ప్పుడు చ‌దువుకున్నాం. పాల‌న‌లో మ‌త ప్ర‌మేయం ఉండ‌కూడ‌దు. కానీ, కేసీఆర్ చేస్తున్న‌దేంటీ..? మొక్కుల పేరుతో దేవాల‌యాల‌కు కోట్ల‌కు కోట్లు కానుక‌లిస్తూ ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పంపుతున్న సంకేతాలేంటీ..? ఈ విష‌యాల గురించి మంత్రి మాట్లాడితే బాగుండేది. త‌మ నాయ‌కుడిని వెన‌కేసుకుని రావ‌డం త‌ప్పులేదు. ఈ క్ర‌మంలో మ‌నం ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సిగ్న‌ల్స్ ఇస్తున్నామ‌నేది కూడా విశ్లేషించుకోవాలి క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close