త‌మ‌న్నా.. అప్ప‌ట్లో చీపే!

ఇప్పుడు త‌మ‌న్నా పారితోషికం చుక్క‌ల్లో ఉంది. హీరో ఎవ‌రైనా, ద‌ర్శ‌కుడి రేంజ్ ఎంతైనా స‌రే – తమ్మూ అడిగినంత ఇవ్వాల్సిందే. ప్ర‌త్యేక గీతాల‌కు త‌మ‌న్నా దాదాపు అరకోటికిపైగానే డిమాండ్ చేస్తోంది. క‌థానాయిక గా త‌మ‌న్నా కాల్షీట్లు కావాలంటే కోటికి పైనే స‌మ‌ర్పించుకోవాలి. అయితే.. ఇదంతా ఇప్పుడు. ఒక‌ప్పుడు త‌మ‌న్నా కూడా చాలా చీప్‌. హ్యాపీడేస్‌కి ముందు త‌మ‌న్నా శ్రీ అనే సినిమా చేసింది. మంచు మ‌నోజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మూవీస్ సంస్థ తెర‌కెక్కించింది. మంచు వారు.. త‌మ‌న్నాకి ఇచ్చిన పారితోషికం అక్ష‌రాలా రూ.3 ల‌క్ష‌ల‌ట‌.

అయితే అంత‌కు ముందు మోడ‌ల్‌గా రాణించింది త‌మ‌న్నా. తొలినాళ్ల‌లో మోడ‌లింగ్‌లో త‌మ‌న్నాని ఎవ్వ‌రూ గుర్తించ‌లేదు. మోడ‌ల్‌గా త‌మ‌న్నా తొలి పారితోషికం కేవ‌లం రెండు వేల రూపాయ‌లు మాత్ర‌మే. శ్రీ ఫ్లాప‌వ్వ‌డంతో.. హ్యాపీడేస్ వ‌ర‌కూ త‌మ‌న్నా ఖాళీనే. హ్యాపీడేస్‌కి కూడా త‌మ‌న్నాకి ఇచ్చిన పారితోషికం ఆరంటే ఆరు ల‌క్ష‌ల రూపాయ‌లు. ఆ త‌ర‌వాత‌.. ఒక్క‌సారిగా రూ.20 ల‌క్ష‌లు పెంచేసింది త‌మ‌న్నా. 100 % ల‌వ్ కి గీతా ఆర్ట్స్ 30 ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. ఆ త‌ర‌వాత‌.. ఏకంగా త‌న పారితోషికాన్ని మూడు రెట్లు పెంచేసింది. ఇప్పుడు కోటికి త‌గ్గినా ముక్కుపిండి వ‌సూలు చేస్తోంది. స్టార్ డ‌మ్ వ‌చ్చాక‌.. అడిగినంత ఇవ్వాల్సిందే మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close